పొడి చెత్త సేకరణ కేంద్రం ప్రారంభం


Wed,August 14, 2019 12:06 AM

సిద్దిపేట అర్బన్ : పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని మహిళలు విజయవంతం చేయాలని మెప్మా టీఎంసీ కె.సాయికృష్ణ తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచన మేర కు, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం సిద్దిపేటలో ని 7వ వార్డులోని వివేకానంద సమాఖ్య సభ్యులు పొడిచెత్త సేకరణ కేంద్రా న్ని ప్రారంబించారు. ఇంట్లోని పొడి చెత్తను మున్సిపల్ వాహనానికి ఇవ్వకుండా సభ్యులందరూ వా రానికి ఒకసారి జమ చేసిన చెత్తను సమాఖ్య ద్వారా సేకరించి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆదాయంతో పిల్లలకు నోట్‌బుక్స్, పెన్నులు కొనవచ్చన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్సెక్టర్ సత్యనారాయణ, మెప్మా శశీధర్‌రెడ్డి, సీవోలు రమ్య, రేణుక, జ్యోతి, ఆర్పీ సుజాత, సమాఖ్య ప్రతినిధు లు కళావతి, గ్యాంగ్ పద్మ, సభ్యులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...