ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటాలి


Wed,August 14, 2019 12:05 AM

మిరుదొడ్డి : ప్రతి ఒక్కరూ విధిగా ఐదు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎంపీపీ గజ్జెల సాయిలు అన్నారు. రాష్ట్ర ప్ర భుత్వం చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని లింగుపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి 10 మొక్కల చొప్పున వివిధ రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వాతావరణ కా లుష్యాన్ని నివారించి ప్రజలకు ఆక్సిజన్‌ను చెట్లే అందిస్తున్నాయ ని పేర్కొన్నారు. అడవులు అంతరించి పోవడంతో భూమి మీ దున్న సమస్త జీవులకు పలు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వాన కాలం సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి గ్రామాలు పచ్చని పంట పొలాలతో కళకళలాడాలంటే ప్రజలు మొక్కలను నాటాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జోగ్గారి బాల్‌నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీమతి, వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

వీరారెడ్డిపల్లిలో మొక్కల పంపిణీ
వీరారెడ్డిపల్లిలో మంగళవారం సర్పంచ్ పన్యాల వెంకట్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చాట్లపల్లి బాలమల్లేశం గౌడ్ కలిసి సంయుక్తంగా గ్రామస్తులకు ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నేతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఆకారంలో హరితహారం..
దుబ్బాక,నమస్తే తెలంగాణ : గ్రామాల్లో ఉద్యమంలా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆకారం ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మి కోరారు. మంగళవారం మండలంలోని ఆకారంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి పూల, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు హరితహారంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి గ్రామాన్ని హరిత గ్రామంగా మార్చాలని తెలిపారు. ఇంటి ఆవరణలలో పంట పొలాల వద్ద, రోడ్ల పక్కన మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా భావించి మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యువజన, మహిళా సంఘాలు, విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, వారు ్డసభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులుపాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...