ప్రారంభానికి సిద్ధమైన వ్యవసాయ కార్యాలయం


Wed,August 14, 2019 12:05 AM

దుబ్బాక టౌన్ : దుబ్బాక వ్యవసాయ శాఖ కార్యాలయ నూతన భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. లచ్చపేటలో నిర్మించిన ఏడీఏ కార్యాలయం రూ.40 లక్షలతో నిర్మించబడింది. అన్ని వసతులతో రెండంతస్తుల్లో ఈ భవనం నిర్మించారు. నియోజకవర్గంలోని రైతులకు వ్యవసాయ పరంగా అందుబాటులో ఉండే విధంగా ఈ భవనాన్ని నిర్మించారు. ఇంతకాలం దుబ్బాకలో ఉన్న పాత వ్యవసాయ శాఖ కార్యాలయం ఎప్పుడో జమాన కింద కట్టింది. ఏమాత్రం సౌకర్యాలు లేకపోవడంతో రైతులతో సమావేశాలు నిర్వహించడం కష్టంగా ఉండేది. సబ్సిడీ పరికరాలను అందుబాటులో ఉంచేందుకు వసతి లేకుండా పోయింది. దీంతో చాలా ఇబ్బందులు పడాల్సివచ్చేది. దుబ్బాక ఏడీఏ పరిధిలోని దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్, తొగుట మండలాలకు చెందిన అధికారులు, రైతులు నిత్యం ఏడీఏ కార్యాలయానికి వస్తూ పోతుంటారు. ప్రస్తుతం ఉన్న కార్యాలయంలో ఇబ్బందులను గ్రహించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యవసాయశాఖ నుంచి రూ.40 లక్షల నిధులను మంజూరు చేయించి నిర్మాణ పనులను వేగిరపరిచారు. కొత్తగా నిర్మించిన కార్యాలయంలో విశాలమైన గ దులు, రైతులతో సమావేశం అయ్యేందుకు సమావేశ మందిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత నివ్వడం, అందులో రైతులకు ఎప్పటికప్పుడు వ్యవసాయంలో తగిన సూచనలు అందించేందుకు వీలుగా భవన నిర్మాణం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కొద్ది రోజుల్లో అధునాతన సౌకర్యాలతో ఏడీఏ భవనం ఈ ప్రాంత రైతులకు అందుబాటులోకి రానుంది.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...