పెట్టిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలి


Mon,August 12, 2019 10:41 PM

మిరుదొడ్డి : భూమి మీద జీవిస్తున్న అన్ని జీవులకు చెట్లే ఆధారమని అల్వాల సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారం పథకంలో భాగంగా సోమవారం మహిళా సంఘాల్లోని మహిళలకు ప్రతి ఇంటికి 10 మొక్కల చొప్పున వివిధ రకాల పండ్ల మొక్కలను అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు తాము పెట్టిన మొక్కలను ఒక్కటి కూడా ఎండి పోకుండా జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. భావితరాల మనుగడ కొనసాగాలంటే మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రజలపై ఎంతైనా ఉందన్నారు. అడవులు అంతరించి పోవడంతో నేడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నేతలు, ప్రజలు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...