నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో బక్రీద్


Mon,August 12, 2019 10:41 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో సొమవారం బక్రీద్‌ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, దౌల్తాబాద్,రాయపోల్, తొగుట మండలాల్లో బక్రీద్‌ను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు అల్లాపై సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ ఖుర్బాణీలు పంపిణీ చేశారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ కావడంతో ముస్లింలు తమ పేరిటా గొర్రె పొట్టేళ్లను వధించారు. వధించిన పొట్టేళ్ల మాంసాన్ని బంధుమిత్రులకు పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామాల్లో ముస్లింలకు హిందువులు సోదరభావాన్ని చాటుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...