ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య


Mon,August 12, 2019 10:41 PM

వర్గల్: మండల పరిధిలోని నెంటూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బేగంపేట ఎస్సై విజయ్‌కుమార్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన కొత్తొల్ల యాదయ్య(42) తన ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకొని మరణించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మనస్తాపంతోనే యాదయ్య ఉరి వేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, కూతుర్లు మమత(18) కల్పన (16) ఉన్నారు. కేసునమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ దవాఖానకు తరలించారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...