అవయవ దానం గొప్పది


Mon,August 12, 2019 10:41 PM

ములుగు: ప్రమాదవశాత్తు వ్యక్తి మరణిస్తే అతని అవయవాలు దానం చేసి ఇతరులకు ప్రాణం పోయడం ఎంతో గొప్ప విషయమని జీవన్‌దాన్ సంస్థ పీఆర్వో పవన్‌రెడ్డి అన్నారు. ములుగు మండల పరిధిలోని మామిడ్యాల గ్రామానికి చెందిన ఆరె శంకర్(32) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ బాధను దిగమింగుకొని అతని కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ సంస్థ ద్వారా శంకర్ అవయవాలు దానం చేసి ఆపదలో ఉన్న మరో ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించిన విషయం విధితమే.

కాగా మామిడ్యాల గ్రామంలో నివసిస్తున్న శంకర్ కుటుంబ సభ్యులను జీవన్‌దాన్ సంస్థ పీఆర్వో పవన్‌రెడ్డి తమ సభ్యులతో కలిసి సోమవారం పరామర్శించి మెమెంటో అందించారు. ఈ సందర్భంగా పీఆర్వో పవన్‌రెడ్డి మాట్లాడుతూ... అవయదానానికి ముందుకువచ్చి శంకర్ కుటుంబ సభ్యులు తమ గొప్ప మనస్సును చాటుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. శంకర్ కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...