డివైడర్ తొలగింపు


Mon,August 12, 2019 10:40 PM

గజ్వేల్ టౌన్: ఇందిరాపార్కు చౌరస్తాలో డివైడర్‌ను ట్రాఫిక్ పోలీసులు సోమవారం జేసీబీ సాయంతో తొలిగించారు. మూడు రోజుల క్రితం గజ్వేల్‌లో నిర్వహించిన శాంతి సమావేశంకు విచ్చేసి అదనపు సీపీ నర్సింహారెడ్డి దృష్టికి ఇందిరాపార్కు చౌరస్తాలో ప్రతి రోజు పట్టణ వాసులకు, ప్రయాణికులకు ఎదురవుతున్న సమస్యను మాజీ కౌన్సిలర్ బోస్ తీసుకెళ్లారు. వెంటనే సమావేశం అనంతరం నర్సింహారెడ్డి ఇందిరాపార్కు చౌరస్తాకు చేరుకొని ట్రాఫిక్ సమస్యను పరిశీలించి ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేశారు. డివైడర్ తొలగించాలని పై అధికారులు సూచించడంతో సోమవారం ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. దీంతో ప్రయాణికులకు పాత గజ్వేల్‌కు వెళ్లెందుకు దూరం సులభతరమైంది. డివైడర్‌ను తొలగించడంతో పట్టణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...