ఏడోరోజు 632 మందికి వైద్య పరీక్షలు


Sun,August 11, 2019 11:30 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో చింతమడకలో నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో ఆదివారం 632 వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 240 మంది పురుషులు, 287మంది స్త్రీలు, 45 మంది బాలురు, 60 మంది బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్తం, 2డీఎకో, ఈసీజీ, రొమ్ము పరీక్షలు, ఎక్స్‌రే, క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలను నిర్వహించారు.

22మంది సాధారణ వైద్యులు, ఆరుగురు జనరల్ ఫిజీషియన్లు, ఇద్దరు గైనకాలజిస్టులు, ముగ్గురు రేడియాలజిస్ట్‌లు, ఇద్దరు కార్డిలయాజిస్ట్‌లు 120 మంది యశోద ఆసుపత్రి సిబ్బంది, 20 మంది పారామెడికల్ సిబ్బంది, ఐదుగురు ఏఎన్‌ఎంలు, ఐదుగురు సూపర్‌వైజర్లు, 10 మంది హెల్త్ అసిస్టెంట్లు, 15 మంది అంగన్‌వాడీలు, 30 మంది వలంటీర్లు వైద్య శిబిరం విధుల్లో పాల్గొన్నారు. యశోద గ్రూప్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌వో అమర్‌సింగ్, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి సరోజ, గడ వైద్యాధికారి, వైద్య శిబిరం ఇన్‌చార్జి డా. కాశీనాథ్, ఆర్‌బీఎస్‌కే జిల్లా కో-ఆర్డినేటర్ చక్రధర్, చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ సర్పంచులు హంసకేతన్‌రెడ్డి, మిట్టపల్లి ఎల్లవ్వ, భాగ్యలక్ష్మి బాలయ్య, ఎంపీటిసీ జ్యోతి దేవేందర్, మేడబోయిన రాజవ్వలు నాయకులు వెంకట్‌రెడ్డి, చంద్రం తదితరులు పర్యవేక్షించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...