సిద్దిపేట మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమం


Sun,August 11, 2019 11:29 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : తడి-పొడి చెత్తను వేరుచేసి ఇవ్వడంలో సిద్దిపేట మున్సిపాలిటీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిదిపేట రూరల్ మండల పరిధిలోని బుస్సాపూర్ గ్రామ శివారులోని సిద్దిపేట మున్సిపల్ డంప్ యార్డులో రూ. 50 లక్షల సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణంకు, రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీకల్‌స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, మున్సిపల్ చెర్మన్ రాజనర్సుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీలలో కేవలం సిద్దిపేట మున్సిపాలిటీ మాత్రమే తడి-పొడి చెత్తను వేర్వేరుగా చేసి చెత్తను అందజేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పట్టణ ప్రజలు, స్వయం సహాయక బృందాల సాయంతో స్వచ్ఛందంగా 60శాతం వరకు చెత్తను వేరు చేసి ఇస్తున్నారని, 40శాతం మైకనైజ్డ్ ద్వారా బుస్సాపూర్‌లోని డంప్‌యార్డ్‌లో వేరు చేయబడుతుందన్నారు.

ఇందుకోసం రూ.50లక్షలతో సెగ్రగేషన్ షెడ్‌ను 3 నెలలో పూర్తి చేయాలని సూచించారు.మరో రూ.1.20కోట్లతో ఫీకల్ స్లజ్డ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను 6నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. దీంతో 100 శాతం చెత్త వేరు చేయబడుతుందన్నారు. తడి-పొడి చెత్తను వేరువేరు చూసి ఆదాయ వనరులు తెచ్చుకునేలా సిద్దిపేట మున్సిపాలిటీ కృషి చేస్తున్నదన్నారు. త్వరలోనే పట్టణంలో పలు వార్డులలోడీఆర్సీ కేంద్రాలను నిర్వహించాలని, ప్రధానంగా పట్టణంలోని స్వయం సహాయక బృందాల పాత్ర ముఖ్యమని, వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా రెండు రకాల చెత్తను వేర్వేరు చేస్తున్న విధానం, మెకనైజ్డ్, మాన్యవల్ పద్దతి అంశాలపై ఏజెన్సీకి చెందిన ప్రతినిధులతో చర్చించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఈఈ వీరప్రతాప్, డీఈ లక్ష్మణ్, కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్, బుస్సాపూర్ సర్పంచ్ సదాశివరెడ్డి, ఏఈలు, శానిటరీ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...