నంగునూరులో.. హరితహారం


Sun,August 11, 2019 11:29 PM

హరితహారం కార్యక్రమంలో భాగంగా నంగునూరు మండల కేంద్రంలో సర్పంచు మమత-జయపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కోల సునీత-మహేందర్‌గౌడ్, ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికీ పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశాల మేరకు జామ, అల్లనేరడి, ఉసిరి, దానిమ్మ మొక్కలను ప్రతి ఇంటికి ఐదు చొప్పున అందిస్తున్నామన్నారు. ఆకుపచ్చ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

జేపీ తండాలో.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని జేపీ తండాలో సర్పంచు భిక్షపతి నాయక్ ఆధ్వర్యంలో శ్రమదానం చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచు మాట్లాడుతూ.. రాంపూర్ క్రాస్ వద్ద ఉన్న బస్టాప్‌కు రంగులు వేయడంతో పాటు పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటామన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సహకారంతో జేపీ తండా గ్రామాన్ని మరింత అభివృద్ది చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

ఎల్లుపల్లిలో..
సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట అర్బన్ మండలం ఎల్లుపల్లి గ్రామంలో ఆదివారం రైతులకు నీలగిరి మొక్కలను సర్పంచ్ జయశ్రీ, గ్రామ ఉప సర్పంచ్ రజనీకర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి వినోద్‌కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రైతులు ఖాళీ ప్రదేశాలలో నీలగిరి మొక్కలు నాటుకోవాలన్నారు. నీలగిరి మొక్కలతో పాటు రైతులు టేకు చెట్లు కూడా పొలం గట్లపైన నాటుకోవాలన్నారు. రైతులకు ఎన్ని మొక్కలైన అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు తప్పని సరిగా పెంచుకోవాలన్నారు. అవసరమైన వారికి పండ్ల మొక్కలను అందజేస్తామన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...