నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి: సుడా చైర్మన్


Sun,August 11, 2019 11:28 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు గ్రామ శివారులో రంగనాయకసాగర్ కాలువ ఇరువైపులా ఎంపీపీ శ్రీదేవి చందర్‌రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌తో కలిసి సూడా చైర్మన్ రవీందర్‌రెడ్డి ఈత మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నాటిన ఈత మొక్కలను సంరక్షించే భాద్యత తమదేనని గౌడ కులస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు నరేశ్, ఎంపీటీసీ లత-వెంకట్, ఉప సర్పంచు ప్రసాద్, మొక్కల పంపిణీ ఇంఛార్జ్ సత్యనారాయణ గౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...