నేడు ఎస్సీ ఉపకులాల సమావేశం


Sun,August 11, 2019 11:27 PM

సిద్దిపేట టౌన్: ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించనున్నామని పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రుద్ర రాజలింగం, బైరి వెంకటేశం హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని ఎస్సీ ఉపకులాలైన మోచీ, మాల జంగం, బైండ్ల, బేడ బుడగ జంగం, కొలుపుల, హోలియాదాసరి, చిందు, దక్కలి, మాదిగ జంగం, పోతరాజుల మొదలైన ఉప కులాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సమావేశంలో భాగస్వాములు కావాలని కోరారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...