సమరస్ఫూర్తికి స్వర్ణోత్సవం


Sat,August 10, 2019 11:23 PM

-రెండోదశ ఉద్యమానికి ఊపిరిపోసిన నాటి పోరాటం
-పాల్వంచ నుంచి పురుడు పోసుకున్న సమరం
-సమైక్య పాలకుల కాల్పుల్లో 369 మంది మృతి
-ఆ ఘటనతో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ పోరు
-నేడు సిద్దిపేటలో 70 మంది ఉద్యమకారులకు ఘన సన్మానం
-హాజరుకానున్న ఎంపీ కేపీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సోలిపేట, ఎమ్మెల్సీలు
-ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ :అడుగడుగునా అణగదొక్కడమే కాకుండా విద్య, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం చేయడంతో పుట్టుకొచ్చిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. నాటి సమైక్య రాష్ట్రం దగాకోరు పాలనలో తెలంగాణ బిడ్డలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. దారుణంగా వంచనకు గురైన తెలంగాణ బిడ్డలు నిప్పుకణికలుగా మారి జైతెలంగాణ అని నినదిస్తూ స్వరాష్ర్టాన్ని డిమాండ్ చేస్తూ సాగించిన తొలిదశ సమరమే 1969 పోరాటం. ఆ మహోన్నత పోరాట చరిత్రకు అర్ధ శతాబ్ది. ఆరని నెత్తుటి జ్ఞాపకానికి 50 ఏండ్లు పూర్తయ్యాయి. పూర్వపు ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుత్కేంద్రంలో స్థానికేతరుల నియామకాలకు వ్యతిరేకంగా 1969 జనవరి 6న రవీంద్రనాథ్ అనే వ్యక్తి ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష పోరాటానికి పునాది పడింది. ఆ తర్వాత జరిగిన ఉద్యమాలను అణగదొక్కిన సమైక్య సర్కారు..369 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకుంది. 2001లో నేటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన మలిదశ ఉద్యమానికి తొలిదశ పోరు స్ఫూర్తినిచ్చింది. అర్ధ శతాబ్దం పూర్తయిన సందర్భంగా ఆదివారం సిద్దిపేటలో సమరస్ఫూర్తికి స్వర్ణోత్సవం పేరిట ప్రత్యేక సభను నిర్వహిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎగిసిపడిన భూమి పుత్రల పోరాటాల్లో ముందు వరసలో ఎన్నదగిన మహోద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం. సమైక్య రాష్ట్రంలో దారుణంగా దగా పడ్డ తెలంగాణ బిడ్డలు నిప్పుకణికలుగా మారి, జై తెలంగాణ.. అని నినదిస్తూ, స్వరాష్ర్టాన్ని డిమాండ్ చేస్తూ, సాగించిన తొలిదశ పోరాటమే 1969 పోరాటం. ఆ మహోన్నత పోరాట చరిత్రకు అర్ధ శతాబ్ధి. ఆరని నెత్తుటి జ్ఞాపకానికి అర్ధ శతాబ్ధి, సాయుధ బలగాలతో ప్రజలు నిరాయుధంగా, సాహసోపేతంగా జరిపిన అనాటి ఆ ప్రత్యక్ష అర్ధశతాబ్ధి వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. మహోన్నత పోరాట చరిత్రకు అర్ధ శతాబిని పురస్కరించుకొని సిద్దిపేటలో సమర స్ఫూర్తికి స్వర్ణోత్సవం పేరిట ఆదివారం సాయంత్రం ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 70 మంది తెలంగాణ ఉద్యమకారులను సన్మానించనున్నారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హజరుకానున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

అక్రమ నియామకాలతో ప్రారంభమై..
పాల్వంచ థర్మల్ విద్యుత్ కేంద్రంలో స్థానికేతరుల అక్రమ నియామకాలకు వ్యతిరేకంగా 1969 జనవరి 6న రవీంద్రనాథ్ అనే వ్యక్తి ప్రాంరభించిన ఆమరణ నిరాహార దీక్ష పోరాటానికి తొలి నిప్పుకణాలను తయారు చేసింది. విద్యార్థులు వీధుల్లోకి రావడంతో ఉద్యమం ఉధృతమైంది. సమైక్య సర్కారు కాల్పులకు తెగబడడంతో 369 మంది విద్యార్థులు బలయ్యారు. పూర్వపు మెదక్ జిల్లాలో సదాశివపేటలో, గజ్వేల్‌లో జరిగిన కాల్పులలో ప్రాణ నష్టం జరిగింది. గజ్వేల్‌లో నర్సింహులు అనే పసిపిల్ల వాడు అసువులు బాశాడు. 1969 మే నెలలో చెన్నారెడ్డి అధ్యక్షుడిగా తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు కావడంతో సిద్దిపేటకు ప్రాతినిధ్యం వహించిన మదన్‌మోహన్ తెలంగాణ ప్రజా సమితి నుంచే ఎదిగాడు. 1970లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీపీఎస్11 స్థానాలు గెలుచుకుంది. ప్రజాతీర్పును బేఖాతరు చేస్తూ ఉద్యమ నాయకత్వాన్ని లొంగదీసుకొని పోరాటం వెన్ను విరించింది నాటి సమైక్య ప్రభుత్వం. తెలంగాణ తీవ్ర నిస్పృహలో కూరుకుపోయింది. అనంతరం కాళోజి, జయశంకర్ వంటి పెద్దలు మొక్కవొని విశ్వాసంతో తెలంగాణ చైతన్య జ్యోతిని ఆరిపోకుండా ఉద్యమాన్ని కొనసాగించారు.

చరిత్ర గతిని మార్చివేసిన సీఎం కేసీఆర్
1969 నుంచి మలిదశ ఆలోచనలు అంకురించినప్పటికీ, వివిధ సంస్థలు, ఉద్యమ నిర్మాణానికి ప్రయత్నించాయి. 2001లో నేటీ సీఎం కేసీఆర్ నాడు టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించడంతో చరిత్ర దిశ, దశ మారిపోయింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి టీఆర్‌ఎస్ అధినేత 14ఏండ్లు నిత్య ఉద్యమ చైతన్యాన్ని రగిలించి, అద్భుతంగా పోరాటాన్ని నడిపించడంతో ఉద్యమం విజయం తీరం చేరింది. అమరుల త్యాగం సార్థకమై, ప్రజల స్వప్నం ఫలిచింది. 2014 జూన్ 2న 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

నేడు 70మంది ఉద్యమకారులకు సన్మానం
మలి దశ ఉద్య విజయానికి ప్రేరణంగా నిలిచిన 1969 ఉద్యమం జరిగి 50 ఏండ్లు అవుతున్నది. ఈ సందర్భంగా ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో 1969 ఉద్యమ స్వర్ణోత్సవ నిర్వహణ కమిటీ ఏర్పడింది. నేటి సాయంత్రం (11వ తేదీ) తెలంగాణ అమరుల ప్రాంగణం(తాడూరి బాలగౌడ్ గార్డెన్స్)లో తొలి తెలంగాణ ఉద్యమానికి అర్ధ శతాబ్ధి సమర స్ఫూర్తికి స్వర్ణోత్సవం పేరుతో ప్రత్యేక సభను ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లా పరిధిలో 1969 ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్న ఉద్యమకారులను గౌరవంగా సన్మానించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

చేనేత వస్ర్తాలతో సన్మానించనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. చేనేత వస్ర్తాలతో పాటు ఒక జ్ఞాపికను అందజేస్తారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా జి. పాపయ్య వ్యవహరించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెలే తన్నీరు హరీశ్‌రావు హజరవుతున్నారు. విశిష్ట అతిథులుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, కూర రఘోత్తంరెడ్డి, గౌరవ అతిథులుగా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి హాజరుకానున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...