వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం


Sat,August 10, 2019 11:21 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో రూ.4.35కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్పటి మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.20కోట్ల నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులతో పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పట్టణంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రధానంగా సెంట్రల్ లైటింగ్ సిస్టం, డిపో, దవాఖాన బైపాస్ రోడ్ల నిర్మించారన్నారు. పట్టణంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా లక్షలాది రూపాయలు వెచ్చించి అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్ లైన్లు వేయించామని, ప్రత్యేకంగా కొత్త విద్యుత్ సబ్‌స్టేషన్ కూడా నిర్మించామన్నారు. పట్టణ అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు కావడం హర్షనీయమని, ఈ నిధులతో పట్టణంలో అభివృద్ధి శరవేగంగా జరుగతుందన్నారు. శంకుస్థాపన చేసిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయా వార్డుల్లో మొక్కలు నాటారు.

గౌరవెల్లితో హుస్నాబాద్ తీరు మారుతుంది
హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయని అయిన గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ చెప్పారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి రావడంతో పంటల ఉత్పత్తులు పెరుగడం, ఇందుకు సంబంధించిన పరిశ్రమలు రావడం, వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలు రెట్టింపవడంతో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడాదిలోగా గౌరవెల్లికి గోదావరి జలాలు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ లకావత్ మానస, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, ఇన్‌చార్జి కాసర్ల అశోక్‌బాబు, మాజీ కౌన్సిలర్లు గాదెపాక రవీందర్, దొడ్ల శ్రీనివాస్‌రెడ్డి, గూల్ల రాజు, చొప్పరి లక్ష్మీశ్రీనివాస్, ప్రతిభ, హేమలత, గోవిందు రవి, ఇంద్రాల సారయ్య, లక్ష్మణ్‌నాయక్, రమేశ్‌రెడ్డి, నాయకులు బీలూనాయక్, చిట్టి గోపాల్‌రెడ్డి, వీరన్నయాదవ్, రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, థామస్, బండి పుష్ప, బొద్దుల కనుకలక్ష్మీ, స్వరూప, గడ్డం మోహన్, ముప్పిడి రాజిరెడ్డి, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...