సుమంత్‌కు సత్కారం


Sat,August 10, 2019 11:20 PM

చిన్నకోడూరు : యూపీపీఎస్‌సీ గ్రూప్-ఏలో పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 49వ ర్యాంకు సాధించిన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామానికి చెందిన వేలేటి శ్రీనివాస్ శర్మ-శ్రీలీల దంపతుల కొడుకు వేలేటి సుమంత్‌శర్మ అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎంపికయ్యాడు. దేశవ్యాప్తంగా జరిగిన సెంట్రల్ ఆర్డ్మ్ పోలీసు ఫోర్సెస్-అసిస్టెంట్ కమాండెంట్(సీఏపీఎఫ్) పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన 36 మంది అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు శనివారం రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో స్టాండింగ్ ఓవేషన్(నిలబడి చప్పట్లతో గౌరవాన్ని అందించడం) కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దీనికి సుమంత్ శర్మ తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్‌గా ఎంపికై సుమంత్‌శర్మ మాట్లాడారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ విద్యార్థుల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, సివిల్స్‌కు ఏ విధంగా సన్నద్ధం కావాలో సూచనలు సలహాలు ఇచ్చేవారన్నారు. సమయం దొరికినపుడు సీపీ విద్యార్థులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, అవసరమైన సమాచారాన్ని అందించేవారన్నారు. వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న 15 మంది విద్యార్థులు సివిల్స్‌లో మంచి ర్యాంకులు సాధించారన్నారు. ఈ అభినందన సమావేశంలో ఎన్‌ఐఎస్‌ఎ డైరెక్టర్ అంజనా సిన్హా ఐపీఎస్, సీఆర్‌పీఎఫ్ ఐజీ ఎం.ఆర్ నాయక్, వేలేటి సుమంత్‌శర్మను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి మరింత కష్టపడి తల్లిదండ్రుల ఆశయాలను, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలన్నదే లక్ష్యం
అమ్మనాన్న ప్రోత్సాహంతో ఈరోజు నేను సివిల్స్‌లో ఆలిండియాలో మంచి ర్యాంకు సాధించా. నాన్న కండక్టర్, అమ్మ లెక్చరర్‌గా పని చేస్తూ నన్ను ఉన్నత చదువులు చదివించారు. మనం ఇక్కడి వరకే ఆగిపోవద్దని తరుచూ అమ్మ చెప్పేది. వారి ప్రోత్సాహంతో పాటు నాకు చిన్నప్పటి నుంచే సివిల్స్ సాధించాలనే పట్టుదల ఉండేది. పెదనాన్న, పెద్దమ్మ వేలేటి రోజారాధాకృష్ణశర్మ క్రియాశీలకంగా రాజకీయాల్లో ఉండి పేద ప్రజలకు సేవలందించడం నాకేంతో స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితోనే కష్టపడి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది.
- వేలేటి సుమంత్‌శర్మ

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...