ఆరో రోజు 804మందికి..


Sat,August 10, 2019 11:20 PM

సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ సొంతూరు, సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో వైద్య శిబిరం కొనసాగుతున్నది. శనివారం 804మందికి పరీక్షలు చేయగా, ఆరో రోజు వరకు మొత్తం 4068 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 345 మంది పురుషులు, 221 మంది స్త్రీలు, 78 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు. అవసరమైన వారికి రక్తం, టూడీఇకో, ఈసీజీ, రొమ్ము పరీక్షలు, ఎక్స్‌రే, క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేశారు. ఆరో రోజు వైద్యశిబిరాన్ని యశోద దవాఖాన మెడికల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ లలితారెడ్డి సందర్శించారు. శిబిరం నిర్వహణ తీరును పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అమూల్యమైన వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

22మంది సాధారణ వైద్యులు, ఆరుగురు జనరల్ ఫిజీషియన్లు, ఇద్దరు గైనకాజిస్టులు, ముగ్గురు రేడియాలజిస్ట్‌లు, ఇద్దరు కార్డిలయాజిస్ట్‌లు, 120మంది యశోద దవాఖాన సిబ్బంది, 20మంది పారామెడికల్ సిబ్బంది, ఐదుగురు ఏఎన్‌ఎంలు, ఐదుగురు సూపర్‌వైజర్లు, 10 మంది హెల్త్ అసిస్టెంట్లు, 15 మంది అంగన్‌వాడీలు, 30 మంది వలంటీర్లు వైద్య శిబిరం విధులు నిర్వహించారు. యశోద గ్రూప్స్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌వో అమర్‌సింగ్, గడా వైద్యాధికారి, వైద్య శిబిరం ఇన్‌చార్జి డాక్టర్ కాశీనాథ్, ఆర్బీఎస్కే జిల్లా కో-ఆర్డినేటర్ చక్రధర్, చింతమడక, సీతారంపల్లి, మాచాపూర్ సర్పంచులు హంసకేతన్‌రెడ్డి, మిట్టపల్లి ఎల్లవ్వ, భాగ్యలక్ష్మి బాలయ్య, ఎంపీటిసీ జ్యోతి దేవేందర్, మేడబోయిన రాజవ్వ శిబిరాన్ని పర్యవేక్షించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...