నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుప్రభాతసేవ పుస్తకం, సీడీ ఆవిష్క


Sat,August 10, 2019 11:19 PM

వర్గల్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో శనివారం హైదరాబాద్‌కు చెందిన సర్వవైదిక సంస్థానం ఆధ్వర్యంలో స్వామివారి పేరిట రూపొందించిన సుప్రభాత సేవ పుస్తకం, సీడీని ఆవిష్కరరించారు. ఈ సందర్భంగా సంస్థానం కులపతి, మహాకవి శ్రీభాష్యం విజయసారధి మాట్లాడుతూ.. సుప్రభాత పుస్తకం, సీడీల ద్వారా స్వామి లీలలు ప్రజల్లోకి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు దోహద పడుతుందని తెలిపారు. ధర్మపురి, యాదాద్రి తర్వాత అంతటి ప్రాచీన వైభవం ఉన్న దేవస్థానం నాచగిరి ఆలయమనితెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే భక్తపాలుడుగా నాచగిరి నరసింహస్వామికి గొప్పఖ్యాతి ఉందని తెలిపారు. కాగా, నాచగిరిలో నేటి నుంచి ఈ నెల 13 వరకు స్వామివారి పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వేద పఠనం,ఆధ్యాయనోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది రంగాచారి, సుధాకర్‌గౌడ్, వేదపండితులు కృష్ణామాచార్యులు, జగన్నాధాచార్యులు, నాగరాజుశర్మ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...