గ్యాస్ సిలిండర్ లీక్.. అంటుకున్న మంటలు


Sat,August 10, 2019 11:19 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ : గ్యాస్ సిలిండర్ లీకై అకస్మాత్తుగా మంటలు లేచి ఇల్లు మొత్తం అంటుకుని పలువురికి గాయాలైన సంఘటన హుస్నాబాద్‌లోని రెడ్డికాలనీలో శనివారం జరిగింది. రెడ్డి కాలనీలోని రిలయన్స్ టవర్ సమీపంలో ఉన్న గూడ శ్రీనివాస్‌రెడ్డి ఇంటిలో గ్యాస్ రీఫిల్‌ను అమర్చుతుండగా గ్యాస్ లీకయింది. దీంతో మంటలు లేవడంతో ఇంట్లోనివారు పరుగెత్తే లోపే నలుగురికి గాయాలయ్యాయి. ఇంట్లోని రెండు గదుల్లో సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. పట్టణానికి చెందిన అయిలేని విక్రమ్‌రెడ్డి ఇంటిలో గూడ శ్రీనివాస్‌రెడ్డి, కవిత దంపతులు, పిల్లలు శ్రీమాన్‌రెడ్డి, మనీశ్వర్‌రెడ్డిలు కొన్ని నెలలుగా అద్దెకు ఉంటున్నారు. శనివారం సత్యనారాయణ వ్రతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వంట గదిలో వంటలు చేయడానికి కొత్త సిలిండర్ తెచ్చి ఓపెన్ చేశారు.

అందులోంచి గ్యాస్ లీకయ్యేది గమనించలేదు. పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టిన దీపం ఉండటం, స్టౌ వెలిగించడటంతో గదిమొత్తం ఆవరించిన గ్యాస్‌తో అకస్మాత్తుగా మంటలు లేచాయి. బయటకు పరుగెత్తే లోపే శ్రీనివాస్‌రెడ్డి భార్య కవిత, పిల్లలు శ్రీమాన్‌రెడ్డి, మనీశ్వర్‌రెడ్డి, బంధువుల అమ్మాయి శ్రీవాహినికి గా యాలయ్యాయి. వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇవ్వడం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. లీకవుతున్న సిలిండర్‌ను బయటకు తెచ్చి నీళ్లలో పడేశారు. అప్పటికే ఇంట్లోని ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, టీవీ, ఫ్యాన్లు, ఏసీ, తలుపు లు, కిటికీలు, వంట తదితర సామగ్రి మంట ల్లో దగ్ధమైంది. గాయపడిన నలుగురిని చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనలో సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు హుస్నాబాద్ ఫైర్‌స్టేషన్ ఇన్‌చార్జి ఎన్.నరేశ్ తెలిపారు.

-హుస్నాబాద్ దవాఖాన సిబ్బందిపై ఆగ్రహం...
తీవ్ర గాయాలైన దవాఖానకు పోతే అక్కడి సిబ్బంది పోవడంపై బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద యం 9గంటల వరకు కూడా డాక్టర్ రాకపోవడం, నైట్ డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంపై విరసన వ్యక్తం చేశారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...