హరీశ్‌రావు సంకల్పానికి తొలి అడుగు


Sat,August 10, 2019 11:18 PM

చిన్నకోడూరు : మనిషి పుట్టుక నుంచి మరణించేంతవరకు ప్రజలకు కనీస అవసరాలను తీర్చేంది ఊరిలో శ్మశానవాటిక.. మనిషి చనిపోతే దహన సంస్కారానికి ఖర్చులు ఇస్తే ఎంతో పుణ్యమని ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంకల్పం. ఆ దిశగా ఇటీవల నియోజకవర్గంలోని అన్నిగ్రామా ల్లో ఉచితంగా దహన సంస్కారాలు చేసే కార్యక్రమానికి హరీశ్‌రావు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలోనే ఉచితంగా అంతిమ దహన సంస్కారాలు నిర్వహించే తొలి గ్రామంగా నారాయణరావుపేట మండలంలోని గుర్రాలగొంది నిలిచింది. సర్పం చ్ ఆంజనేయులు ముందుకు రావడంతో ఎమ్మె ల్యే హరీశ్‌రావు తన సంకల్పానికి గుర్రాలగొంది గ్రామాన్ని ప్రకటించారు. గ్రామంలోని దాతలు వచ్చి సుమారు రూ.8 లక్షల వరకు విరాళాలను ఉచిత దహన సంస్కారాలకు అందజేశారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు సంకల్పం, ఆలోచనకు సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ఆచరణలో చూపి, ఆదర్శంగా నిలుస్తున్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...