ఆధునిక హంగులతో ప్రభుత్వ పీజీ కళాశాల


Sat,July 20, 2019 11:45 PM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట చదువులమ్మ తల్లిగా విరాజిల్లుతున్నది.. రాష్ర్టానికే తలమానికంగా మారింది... విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం భావి భారత పౌరులను దేశానికి అందించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట పట్టణం విద్యారంగంలో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. విద్యార్థుల కల సాకారం చేసేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌తో పోరాటం చేసి పీజీ కళాశాలతోపాటు కొత్త కోర్సులు, కళాశాల భవనం కోసం అసెంబ్లీలో గళమెత్తి ఫలితాన్ని సాధించారు. ఆధునిక భవన నిర్మాణం కోసం రూ.16.39 కోట్లతో కళాశాలను నిర్మించా రు. ఆదివారం పీజీ కళాశాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభిస్తారని శనివారం ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రావు తెలిపారు.

పీజీ కళాశాలకు సీఎం కేసీఆర్ బీజం
సిద్దిపేట పట్టణం విద్యావ్యాపారంగా 30 ఏండ్ల క్రితమే అభివృద్ధి చెందింది. వివిధ జిల్లాల నుంచి ప్రజలకు సిద్దిపేట రావడంతో పట్టణం బాగా విస్తరించింది. ఇక్కడ స్థిరపడ్డ వారికి అన్ని వసతుల కల్పనకు నాటి ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులను సమకూర్చారు. విద్యార్థుల ప్రయోజనార్థం పీజీ కళాశాలను సిద్దిపేటటో మొదటిసారిగా 1993 -94లో సీఎం కేసీఆర్ బీజం వేశారు. మొదట ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రారంభించారు. 60 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మరుసటి సంవత్సరంలో 240 మంది చేరారు. ఇలా పీజీ కళాశాలకు ఆదరణ రావడంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కళాశాలను హరీశ్‌రావు వటవృక్షంగా మార్చారు.

ఎమ్మెల్యే కృషితో ఆధునిక పీజీ కళాశాల
సిద్దిపేట పీజీ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి చేరుతుండడంతో కళాశాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. విద్యార్థుల ఆకాంక్ష నెరవేర్చేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉమ్మడి రాష్ట్రంలోనే కొత్త కోర్సులు, భవిష్యత్ తరాల కోసం ఆధునిక పీజీ కళాశాల నిర్మాణానికి అసెంబ్లీలో గళమెత్తి ఫలితాలు రాబట్టారు. ఆయన సంకల్పంతోనే నేడు సిద్దిపేట పీజీ కళాశాలలో ఆరు కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు పొందుతూ ఉన్నతంగా చదువుతున్నారు. ఎమ్మెల్యే దూర దృష్టితో విద్యార్థుల ప్రయోజనార్థం ఆధునిక పీజీ కళాశాల, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.16.39 కోట్లను మం జూరు చేసి నిర్మించారు.
సిద్దిపేట పీజీ కళాశాలను ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. జీ ప్లస్ టూ పద్ధతిలో పీజీ అకాడమిక్ బ్లాక్, 26 గదులతో 100 మందికి సరిపడా వసతితో గర్ల్స్ హాస్టల్ నిర్మించారు. బాయ్స్ హాస్టల్‌ను 200 మందికి సరిపడేలా 52 గదులతో నిర్మాణం కొనసాగుతున్నది. అ కాడమీ బ్లాక్‌లో 17 క్లాస్‌రూములు, 5 స్టాఫ్ రూ ములు, సెమినార్, కాన్ఫరెన్స్ హాళ్లు వేర్వేరుగా నిర్మించారు. కళాశాలలో మొత్తం 7 ల్యాబ్‌లు ఉండగా, 2 కంప్యూటర్ 3 కెమిస్ట్రీ, జువాలజీ, ఇంగ్లిష్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సకల సౌకర్యాలతో కళాశాల విద్యార్థుల కోసం అందుబాటులోకి వస్తున్నది.

కళాశాలలో లభించే కోర్సులు
సిద్దిపేట పీజీ కళాశాల మొదట్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులతో ప్రారంభమైంది. అనంతరం ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జువాలజీ ఆరు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గతంలో ఇరుకు గదుల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ నూతన పీజీ కళాశాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఏర్పాటు చేశారు. సిద్దిపేట పీజీ కళాశాల రాష్ట్రానికే తలమానికంగా మారనుంది. అన్ని కళాశాలల్లో మాదిరిగానే ఎంట్రెన్స్ టెస్టు నిర్వహిస్తుండడంతో సిద్దిపేట పీజీ కళాశాలకు ఆదరణ పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు అద్దె భవనంలో తరగతులు నిర్వహించగా, ప్రస్తుతం కళాశాల అందుబాటులో రావడంతో రూ.10 లక్షలు ఆదా కానున్నాయి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...