ఘనంగా బోనాల పండుగ


Sat,July 20, 2019 11:43 PM

దుబ్బాక టౌన్: తల్లి బైలెల్లినాదే ...మహంకాళమ్మ బైలెల్లినాదే అంటూ దుబ్బాక, లచ్చపేటలలో వైభవంగా శనివారం మహంకాళమ్మ బోనాల పండుగను నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహంకాళమ్మ బోనాల ఊరేగింపు కన్నులపండుగగా సాగింది. ప్రతియేడు ఆషాఢమాసంలో తొలిఏకాదశి పర్వదినం అనంతరం వచ్చే శనివారం రోజున మహంకాళి అమ్మవారి బోనాల పండుగ రోజుగా పరిగణిస్తారు. అందులోభాగంగా దుబ్బాక పట్టణంలోని రెడ్డి సంఘాలు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు తీశారు. ప్రతి ఇంటి నుంచి రెండు బోనాలతో పాటు మంగళహారతితో బైలెల్లిన బోనాలు పట్టణంలోని ప్రధానవీధుల గుండా సాగి ఒకచోట చేరాయి. బోనాల ఊరేగింపు సందర్భంగా డప్పుచప్పులు, బైండ్ల, పోతురాజుల విన్యాసాలతో ముందుకు సాగుతుండగా, బోనాలు వారిని అనుకరిస్తూ ముందుకు సాగాయి. ఆలయంలో మూడోసారి ఆషాఢమాసం సందర్భంగా జరుగుతున్న బోనాల ఉత్సవాలకు ఆలయం వద్ద నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బోనాల పండుగ మరుసటిరోజైన ఆదివారం గ్రామస్తులు వన భోజనాలకు వెళ్లటం ఆనవాయితీ.

మిరుదొడ్డిలో...
మిరుదొడ్డి: అమ్మా బైలెల్లినాదో..నాయనా..తల్లి బైలెల్లినాదో... నాయనా..అంటూ శనివారం మిరుదొడ్డిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాసం పురస్కరించుకొని మంహాకాళి దేవి అమ్మవారికి బోనాలను తీసి అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం సభ్యులు మహంకాళీ అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి బోనాలను తీసి డప్పు చప్పులతో..బైండ్ల పోతు రాజుల విన్యాసాల మధ్య గ్రామంలోని వీధుల్లో బోనాలను ఊరేగించారు. అనంతరం బోనాల్లోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి పూజలు చేసి మొక్కలను తీర్చుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పురోహితులు విఠాల రాజపున్నయ్య శర్మ, చంద్రశేఖర శర్మ పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...