లక్ష్యానికి మించి సభ్యత్వాలు


Fri,July 19, 2019 11:58 PM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ సభ్య త్వా లు లక్ష్యానికి మించి ఇప్పటికే పూర్తి చేశామని నియోజవర్గం సభ్యత్వ నమోదు ప్రత్యేక ఇన్‌చార్జి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్, పార్టీ ఇన్‌చార్జి పన్యా ల భూపతిరెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్‌లో శుక్రవారం సభ్యత్వ నమోదు వివరాలను వెల్లడించారు. గజ్వేల్ నియోజక వర్గంలో లక్ష్యం 50,000 సభ్యత్వం కాగా, ఇప్పటికే 60,000 పూర్తి చే యలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శుక్రవారం సాయం త్రం వరకే 65,075 సభ్యత్వలు పూర్తయ్యాయన్నారు. ఇందు లో 21,650 క్రీయాశీల సభ్యత్వాలు, 43,425 సాధారణ సభ్యత్వాలు ఉన్నట్లు తెలిపారు. నియోజక వర్గంలోని వర్గల్, ములుగు, మ ర్కూక్, జగదేవ్‌పూర్, గజ్వేల్, కొం డపాక, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో సభ్యత్వ నమోదు కోసం పనిచేస్తు కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేస్తున్న ట్లు పేర్కొన్నారు. అన్ని మండలాల్లో లక్ష్యానికి చేరువలో సభ్యత్వ నమోదు పూర్తి కావస్తుందన్నారు. వర్గల్, జగదేవ్‌పూర్ మండలాలు వెనుకబడినా.. గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తామన్నా రు. ఇప్పటి వరకు నమోదైన సభ్యత్వ వివరాలను ప్రతి మండ ల కేంద్రంలో నిక్షిప్తం చేస్తున్నమని తెలిపారు.

సభ్యత్వంతోపాటు బీమా సదుపాయం..
గజ్వేల్ నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులందరికీ బీమా వర్తింపు చేయాలన్న లక్ష్యంతో పకడ్బందీంగా సభ్యత్వ వివరాలను పొందుపరుస్తామన్నారు. గజ్వేల్‌లోనే ప్రత్యేక డాటా ఎంట్రీ సెంటర్‌ను ఏర్పాటు చేశా మన్నారు. ఇప్పటి వరకు 32,000 మందికి సంబందించిన వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేశామని, పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల జాబితా ఇస్తామని వివరించారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...