కులవృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్


Fri,July 19, 2019 02:33 AM

కొండపాక : అంతరించిపోతున్న ఎన్నో కులవృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆర్ అని టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. గురువారం కొండపాకలో ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. సమైక్య పాలనలో పట్టుకోల్పోయిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రతి వృత్తికి చేయూతనిస్తూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. నిరంతరం ప్రజాసంక్షేమం కోసమే పాటుపడుతూ, దేశంలోని ఏ రాష్ట్రం అందించలేనన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గ్రహించిన ప్రజలు, తిరుగులేని మెజార్టీతో తిరిగి కేసీఆర్‌కే అధికారం అప్పగించారన్నారు. ఇదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో ఆదరిస్తూ, భారీ సంఖ్యలో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతూ సభ్యత్వాలను పొందుతున్నారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సభ్యత్వాలు పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని మించి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. కొండపాక మండలం టీఆర్‌ఎస్ పార్టీకి కొండంత అండగా నిలిచిందని, అలాగే సభ్యత్వ నమోదులోను మొదటిస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం కొండపాక జడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్ ఇంట్లో ఏర్పాటు చేసిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, జిల్లా గ్రంథాలయల సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, దమ్మక్కపల్లి సర్పంచ్ నీల మల్లేశం, వెలికట్ట సర్పంచ్ అమ్ముల నరేశ్, టీఆర్‌ఎస్ మండల నాయకులు రామకృష్ణరెడ్డి, అంబటి బాలచంద్రాగౌడ్, ఆరె భాస్కర్, మంచాల కనకరాములు, మహిపాల్‌రెడ్డి, ఆంజనేయులు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...