మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల


Wed,July 17, 2019 12:19 AMదుబ్బాక టౌన్: త్వరలో జరుగబోయే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 20 వార్డుల్లో 20,071 మంది ఓటర్లకుగాను 41 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి వార్డులో రెండు పోలింగ్‌స్టేషన్‌లో ఎస్సీ పురుషులు 85 మంది ఉండగా, మహిళలు 86 మంది ఉన్నారు. ఎస్టీలో 19మంది పురుషులు, 22మంది మహిళలు ఉన్నారు. బీసీలో మొత్తం 633 మందికి గాను పురుషులు 308, మహిళలు 325 మంది ఉండగా, ఓసీలో 38 మంది పురుషులు, మహిళలు 39 మంది ఉండగా, మొత్తం మొదటి వార్డులో 922 ఓటర్లకుగాను మహిళలు 472, పురుషులు 450 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డులో రెండు పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఎస్సీలో పురుషులు 209, మహిళలు 188 మంది, ఎస్టీలో పురుషులు 2, మహిళలు 4మంది, బీసీలో పురుషులు 232మంది, మహిళలు 229 మంది, ఓసీలో పురుషులు 83, మహిళలు 76 మంది, మొత్తం రెండో వార్డులో పురుషులు 526, మహిళలు 497 మంది ఉన్నారు. మూడో వార్డులో రెండు పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఎస్సీలో పురుషులు 45, మహిళలు 40, బీసీలో పురుషులు 235, మహిళలు 272, ఓసీలో పురుషులు 198, మహిళలు 176, మొత్తం 966మందికిగాను పురుషులు 478, మహిళలు 488 మంది ఓటర్లు ఉన్నారు.

నాల్గోవ వార్డులో రెండు పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఎస్సీలో పురుషులు 305, మహిళలు 319, ఎస్టీలో పురుషులు 9, మహిళలు 13, బీసీలో పురుషులు 101, మహిళలు 101, ఓసీలో పురుషులు 55, మహిళలు 61 మంది, మొత్తం 964 మంది ఓటర్లకుగాను పురుషులు 470, మహిళలు 494 మంది ఉన్నారు. ఐదో వార్డులో ఎస్సీలో పురుషులు 01, మహిళలు లేరు, బీసీలో పురుషులు 419 మంది, మహిళలు 412 మంది, ఓసీలో 109 మంది పురుషులు, మహిళలు 148 మంది ఓటర్లు ఉండగా, మొత్తం 1089 ఓటర్లకుగాను పురుషులు 529 మంది పురుషులు, 560 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆరో వార్డులో మూడు పోలింగ్ స్టేషన్లుండగా, ఎస్సీలో పురుషులు 70 మంది, మహిళలు 45మంది, ఎస్టీలో పురుషులు1, మహిళలు 4, బీసీలో పురుషులు 227, మహిళలు 221, ఓసీలో పురుషులు 160, మహిళలు 182మంది , మొత్తం 910 మంది ఓటర్లకుగాను పురుషులు 458, మహిళలు 452 మంది ఉన్నారు. ఏడో వార్డులో రెండు పోలింగ్‌స్టేషన్లు ఉండగా, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు లేరు, బీసీలో పురుషులు 466, మహిళలు 502, ఓసీలో పురుషులు 19, మహిళలు 19మంది మొత్తం 1006 ఓటర్లకు గాను పురుషులు 485, మహిళలు 551మంది ఉన్నారు.

ఎనిమిదో వార్డులో రెండు పోలింగ్ స్టేషన్లుండగా, ఎస్సీ పురుషులు 14, మహిళలు 6, ఎస్టీలో పురుషులు 20, మహిళలు లేరు, బీసీలు పురుషులు 415, మహిళలు 415, ఓసీలో పురుషులు 76, మహిళలు 85మంది, మొత్తం 1041 మందిగాను పురుషులు 505, మహిళలు 536 మంది ఓటర్లున్నారు. తొమ్మిదో వార్డులో రెండు పోలింగ్ స్టేషన్లుండగా, ఎస్సీలో పురుషులు 227 మంది, మహిళలు 236, ఎస్టీలో పురుషులు 26, మహిళలు 17, బీసీలో పురుషులు 242, మహిళలు 277, ఓసీలో పురుషులు 08, మహిళలు 06మంది ఉన్నారు. మొత్తం 1039 మంది ఓటర్లకుగాను పురుషులు 503, మహిళలు 536 ఓటర్లు ఉన్నారు. పదో వార్డులో రెండు పోలింగ్‌స్టేషన్లు ఉండగా, ఎస్సీలో పురుషులు 14, మహిళలు 06, ఎస్టీలో పురుషులు 20, మహిళలు లేరు, బీసీలో పురుషులు 506, మహిళలు 535, ఓసీలో పురుషులు 07, మహిళలు 08 మంది ఉండగా, మొత్తం 1,076 మందిగాను పురుషులు 527, మహిళలు 549 మంది ఓటర్లు ఉన్నారు. 11వ వార్డులో ఎస్సీలో పురుషులు 95, మహిళలు 80, ఎస్టీలో పురుషులు 01, మహిళలు 02, బీసీలో పురుషులు 405, మహిళలు 459, ఓసీలో పురుషులు 25, మహిళలు 25 మంది ఉండగా, మొత్తం 1092 మందికి గాను పురుషులు 526, మహిళలు 566 మంది ఓటర్లు ఉన్నారు. 12వ వార్డులో ఎస్సీలో పురుషులు, మహిళలు 7 చొప్పున ఉండగా, ఎస్టీలో ఎవరూ లేరు, బీసీలో పురుషులు 486, మహిళలు 530, ఓసీలో పురుషులు, మహిళలు 7 చొప్పున ఉండగా, మొత్తం 1044 మంది ఓటర్లలో పురుషులు 500, మహిళలు 544 మంది ఉన్నారు. 13వ వార్డులో ఎస్సీలో పురుషులు 01, మహిళలు 07, ఎస్టీలో ఎవరూ లేరు. బీసీలో పురుషులు 476, మహిళలు 544, ఓసీలో పురుషులు 20, మహిళలు 19 మంది మొత్తం 1067 మందికి గాను పురుషులు 497, మహిళలు 570 మంది ఓటర్లున్నారు. 14వ వార్డులో ఎస్సీ, ఎస్టీలో ఓటర్లు లేరు, బీసీలో పురుషులు 402, మహిళలు 422, ఓసీలో పురుషులు 57, మహిళలు 62మంది ఉండగా, మొత్తం 943 మంది ఓటర్లకు గాను పురుషులు 459, మహిళలు 484 మంది ఓటర్లున్నారు. 15వ వార్డులో ఎస్సీలో పురుష ఓటర్లు లేరు, మహిళలు 01, ఎస్టీలో ఓటర్లు లేరు, బీసీలో పురుషులు 297, మహిళలు 354 మంది, ఓసీలో పురుషులు 139 మంది, మహిళలు 127, మొత్తం 918 ఓటర్లకు గాను పురుషులు 436, మహిళలు 482 మంది ఓటర్లున్నారు. 16వ వార్డులో ఎస్సీలో పురుషులు10, మహిళలు 06, ఎస్టీలో ఓటర్లు లేరు, బీసీలో పురుషులు 406, మహిళలు 422, ఓసీలో పురుషులు 99, మహిళలు 87మంది, మొత్తం 1030 ఓటర్లుకు గాను పురుషులు 515, మహిళలు 515 మంది ఓటర్లున్నారు.

17వ వార్డులో ఎస్సీలో పురుషులు 07, మహిళలు 04, ఎస్టీలో ఓటర్లు లేరు, బీసీలో పురుషులు 423, మహిళలు 428, ఓసీలో పురుషులు 22, మహిళలు 24 మందిగాను మొత్తం 908 ఓటర్లకు గాను పురుషులు 452, మహిళలు 456 ఓటర్లు ఉన్నారు. 18వ వార్డులో ఎస్సీలో పురుషులు 128, మహిళలు133, ఎస్టీలో పురుషులు లేరు, మహిళలు 02, బీసీలో పురుషులు 249, మహిళలు 280, ఓసీలో పురుషులు 81, మహిళలు 66 మందికి గాను మొత్తం 939 ఓటర్లకు గాను పురుషులు 458, మహిళలు 481మంది ఓటర్లు ఉన్నారు. 19వ వార్డులో ఎస్సీలో పురుషులు 439, మహిళలు 492, ఎస్టీలో ఓటర్లు లేరు. బీసీలో పురుషులు 58, మహిళలు 54, ఓసీలో పురుషులు 04, మహిళలు 01, మొత్తం ఓటర్లు 1,048 ఉండగా పురుషులు 501, మహిళలు 547 మంది ఓటర్లు ఉన్నారు. 20వ వార్డులో ఎస్సీలో పురుషులు 23, మహిళలు 19, ఎస్టీలో పురుషులు లేరు, మహిళలు 04, బీసీలో పురుషులు 468, మహిళలు 485, ఓసీలో పురుషులు 19, మహిళలు 28 మందిగాను మొత్తం 1,046 మందిగాను పురుషులు 510, మహిళలు 536 మంది ఓటర్లున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 20వార్డుల్లో ఎస్సీ పురుష ఓటర్లు 1,680, మహిళా ఓటర్లు 1,675, ఎస్టీ పురుష ఓటర్లు 58, మహిళా ఓటర్లు 68, బీసీలో పురుష ఓటర్లు 6,821, మహిళా ఓటర్లు 7,297, ఓసీలో పురుష ఓటర్లు 1,226, మహిళ ఓటర్లు 1,246 మంది ఓటర్లు ఉండగా మొత్తం 20,071 ఓటర్లలో 9,785 మంది పురుష ఓటర్లు ఉండగా, 10286 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...