తీరు మారకపోతే చర్యలు తప్పవు


Wed,July 17, 2019 12:17 AM

జగదేవ్‌పూర్ : మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఇబ్బందులను వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను గడా ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో పారిశుధ్య లోపం, భోజనం ఏర్పాట్లలో లోపాలపై సదరు కాంట్రాక్టర్, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సిబ్బంది తీరుమార్చుకోకుండా.. ఇలాంటి సంఘటనలు పునరావృతం చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే భోజనంలో లోపాలు ఏర్పడినట్లు తెలిస్తే భోజన కాంట్రాక్టర్ టెండర్ క్యాన్సల్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పాఠశాలలో గదులు, భోజన శాల, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తన దృష్ట్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని వారి సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు తన దృష్టికి వచ్చిందన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో భవనం కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. అన్ని వసతులతో కూడిన మరో భవనం అందుబాటులోకి రాగానే పాఠశాలను షిఫ్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు పాఠశాలలో పారిశుధ్య నిర్వహణపై సిబ్బందికి తగు సూచనలు చేసినట్లు చెప్పారు. మరుగుదొడ్లను శుభ్రం చేయించడంతో పాటు నీటివసతి కల్పిస్తామన్నారు. పాఠశాల చుట్టు పక్కల ఉన్న ముళ్ల పొదలను తొలిగించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్తులకు క్రీడా దుస్తులు షూ అందిస్తామని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తక్షణం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, గురుకుల పాఠశాలల కన్వీనర్ శోభారాణి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజన ఎంపీడీవో పట్టాభిరామారావు, తహసీల్దార్ మతిన్, ఎంపీపీ బాలేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మహేందర్, వెంకటచలమారెడ్డి, కనకయ్య పలువురుగ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...