మిషన్ భగీరథ పథకం రాష్ట్ర ప్రజలకు వరం


Tue,July 16, 2019 03:41 AM

దుబ్బాక టౌన్: తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు సీఎం కేసీఆర్ అందించిన మిషన్ భగీర థ పథకం ప్రజలకు వరంలా మారిందని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో స్థానిక పోస్టాఫీసు వెనుక రూ.23 లక్షలతో నూతనంగా నిర్మించిన లక్షా 50వేల లీ టర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకును జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి సోమవారం ఎమ్మెల్యే సోలిపేట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్లను తెచ్చి ఇంటింటికి అందించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు దుబ్బాక నియోజకవర్గంలో 99శాతం గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనగా, మిషన్‌భగీరథ పూర్తిస్థాయిలో తీ ర్చిందని, నేడు ఇంత కరువు ఉన్నప్పటికీ ప్రజలకు పుష్కలంగా తాగునీరును అందిస్తున్నామని ఎమ్మె ల్యే రామలింగారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో మిషన్‌భగీరథ కింద కొత్తగా 114 ట్యాంకు లు నిర్మించి, 52,826 నల్లా కనెక్షన్లను ఇచ్చామన్నారు. గోదావరి నీళ్లు సముద్రం పాలు కాకూడదన్న లక్ష్యంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారని, మన ప్రాంతంలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో దుబ్బాక నియోజకవర్గం జలకళను సంతరించుకొని ఆకుపచ్చ తివాచీగా మారబోతుందన్నారు. ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించడం అభినందనీయమని, సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే కోరారు.

టీఆర్‌ఎస్ సర్కారే తాగు నీటి ఇబ్బందులను తొలగించింది : రోజాశర్మ
తాగునీటి కష్టాలను గత ప్రభుత్వాలు ఎంత మాత్రం తీర్చలేదని, సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని తన సొంత ఆలోచనతో రూపొందించి, తాగునీటి కష్టాలు దూరం చేశారని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో నాలుగేండ్లుగా ఇంటింటికీ భగీరథ తాగునీరు అందడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ఈ బృహత్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట ప్రజల మధ్యే ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడం ప్రజల అదృష్టమన్నారు. అంతకు ముందు మొదటిసారిగా దుబ్బాకకు వచ్చిన జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ దంపతులను ఎమ్మెల్యే సోలిపేట, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పుష్పలత సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాసచారి, డీఈ విక్రమ్, ఏఈ రోహిత్, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, నాయకులు ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, ఆసస్వామి, భాగ్యలక్ష్మీ, అధికం బాలకిషన్‌గౌడ్, బండిరాజు, గన్నెభూంరెడ్డి, భాను, కొట్టె ఇందిర, పద్మయ్య, నారాయణరెడ్డి, బట్టు ఎల్లం తదితరులు ఉన్నారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...