గ్రామాల్లో జోరుగా స్వచ్ఛభారత్


Tue,July 16, 2019 03:41 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: గ్రామం పరిశుభ్రంగా ఉంటేనే వ్యాధులు రాకుండా ఉంటాయని లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ బొంగురం మంజుల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ముళ్లపొదల తొలిగింపు, శ్రమదానం, వీధులను శుభ్రపర్చడం, పిచ్చిమొక్కల తొలిగింపు తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శితో పాటు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. నారాయణరావుపేట పరిధిలోని బంజేరుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశానుసారం హరితహారంలో భాగంగా 40 వేల మొక్కలు నాటేందుకు గుంతలు తీసే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

చింతమడకలో...
ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా.కార్తీక్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ శానిటేషన్, పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామ సర్పంచు హంసకేతన్‌రెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్, క్లోరినేషన్ ప్రక్రియపై పంచాయితీ పాలకవర్గ సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సరస్వతి, ఎఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

గ్రామాలన్ని పరిశుభ్రంగా మారాలి...
చిన్నకోడూరు: గ్రామాలన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా మార్చుకునేందుకు పంచాయతీ కార్యదర్శుల బృందం విస్తృతంగా ప్రతి గ్రామంలో పర్యటించి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్నారని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి తెలిపారు. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్‌లో సోమవారం మండల పంచాయతీ కార్యదర్శుల బృందంతో కలిసి ఎంపీపీ మాణక్యరెడ్డి స్వచ్ఛభారత్‌లో భాగంగా శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలిగించి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కీసరి పాపయ్య, ఇన్‌చార్జి ఎంపీడీవో సుదర్శన్, సర్పంచ్ కవిత లక్ష్మణ్, ఎంపీటీసీ లచ్చయ్య, మాజీ సర్పంచు ముత్తయ్య, నాయకులు నాంపల్లి, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

విఠలాపూర్‌లో స్వచ్ఛభారత్ ...
స్వచ్ఛ గ్రామమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సర్పంచ్ నవీన్ అన్నారు. చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో స్వచ్ఛభారత్‌లో భాగంగా సోమవారం శ్రమదానం నిర్వహించి గ్రామంలో పెరిగిన చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను తొలిగించి శుభ్రపర్చారు. ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వీవో లీడర్లు, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...