ఆహ్లాదకరం.. చదువుల తల్లి ఒడి


Tue,July 16, 2019 03:40 AM

మిరుదొడ్డి: మండల పరిధిలోని కాసులాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 63 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 8 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆయా సబెక్టుల్లో విద్యా బోదనలు చేస్తున్నారు. 2016-17, 2017-18, 2018-19వ విద్యా సంవత్సరాల్లో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న తెలంగాణ హరితహారం పథకంలో భాగంగా పాఠశాల ఆవరణలో గత మూడు ఏండ్ల కిందటి నుంచి ప్రతి ఏటా మొక్కలను నాటుతున్నారు.

మొక్కలే విద్యార్థులకు స్నేహితులుగా పెంచుతూ..
పాఠశాల ఆవరణలో తెలంగాణ హరితహారం పథకంలో జామ, దానిమ్మ, మామిడి, వేప, బాదాం, ఉసిరి, టేకు, వంటి సుమారు 5 వందల మొక్కలను గత మూడు ఏండ్ల నుంచి పెంచుతున్నారు. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలనే ఉద్ధేశంతోనే హెచ్.ఎం. జోగు ప్రభుదాస్, ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులకు ఒక్కొక్కరికీ 7 మొక్కల చొప్పున అప్పగించి నీరు పోసి ఎండి పోకుండా కాపాడాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పిన మాటలను విద్యార్థులు తూ.చ. తప్పకుండా నిత్యం ఆచరిస్తూ ఉదయం, మధ్యాహ్నం వేళలో మొక్కలకు నీరు పోస్తూ, వాటి చుట్టూ పెరిగే గడ్డి మొక్కలను తొలగిస్తూ కాపాడుతున్నారు.

పాఠశాలకు అందాన్నిస్తున్న పూల మొక్కలు
పాఠశాలలో వివిధ రకాల మొక్కలే కాకుండా బంతి, గులాబీ, మల్లె, గన్నెరు, ఎర్ర మంధారం మొక్కలే కాకుండా ఇతర పూల మొక్కలను పెట్టడంతో సరస్వతీ దేవీ మెడలో పూల మాలలు వేసిన చందంగా పాఠశాలకు అందనిస్తున్నాయి. పాఠశాలలో ఎలాంటి శుభ కార్యక్రమాలు జరిగిన పూలు మాత్రం పాఠశాలల్లోనే ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సునాయసంగా లభిస్తున్నాయి.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...