ఫసల్ భీమ దర్జాగా ధీమ


Tue,July 16, 2019 12:23 AM

-బీమా ప్రీమియం చెల్లించేందుకు సమీపిస్తున్న గడువు
-అరకొర వానలు, అధిక వర్షాలు వచ్చినా రైతుకు బీమా చెల్లింపు
-ఏ పంట సాగుచేస్తే ఆ పంటకే బీమా చేయించుకోవాలి
-గ్రామం యూనిట్‌గా బీమా చేసుకునే వెసులుబాటు
-జిల్లావ్యాప్తంగా 5,22,178 ఎకరాల్లో ఆయా పంటల సాగు
-వానల కోసం నిత్యం ఎదురుచూపులు
-ఆలస్యమవుతున్న పంటల సాగు
-ప్రకృతి వైపరీత్యాలతో దిగుబడులపై ప్రభావం


గజ్వేల్, నమస్తే తెలంగాణ:ఒడిదొడుకులు ఎదుర్కొని సాగుచేసే రైతుపై ప్రకృతి ఒక్కోసారి పగబడుతుంటుంది. వానలు సరిగ్గా కురవకపోవడం, అకాల వానలు పడడం, వచ్చినా అధికంగా కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతులను గట్టెక్కించేందుకు కేంద్రం ఫసల్‌బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా బీమా చేయించొచ్చు. సాగు చేస్తున్న పంటకు మాత్రమే బీమా చేయించాలి. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు బీమా సొమ్ము దోహదపడుతుంది. జిల్లాలో ప్రస్తుతం అరకొర వానలే పడుతున్నాయి. అనేకమంది రైతులు పత్తి విత్తనాలు విత్తి వానల కోసం నింగికేసి చూస్తున్నారు. ఆలస్యంగా సాగు పనులు ప్రారంభమవుతుండడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. వానకాలంలో జిల్లావ్యాప్తంగా అన్నిరకాల పంటలు కలిపి 5,22,178 ఎకరాల్లో సాగవుతాయి. ప్రధానంగా మొక్కజొన్న, పత్తి, వరితోపాటు జొన్న, పెసర, కంది, సోయ, మినుములు, పండ్లు, కూరగాయ పంటలు సాగవుతాయి. మొక్కజొన్నను గ్రామ యూనిట్‌గా మిగతా అన్ని పంటలు మండల యూనిట్‌గా గుర్తిస్తారు. అకాల వర్షాలు, వరదలు, వడగండ్లు, ఇసుక మేటలు, అతివృష్టి, అనావృష్టి కొన్నిరకాల తెగుళ్లతో పంట నష్టం ఏర్పడినప్పుడు బీమా వర్తిస్తుంది. పత్తికి బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువు ముగియగా..మిగతా వాటికి జూలై 31 వరకు గడువు ఉన్నది.

గజ్వేల్, నమస్తే తెలంగాణ: ప్రస్తుత, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రైతులు వానకాలం సాగుపై అప్రమత్తం కావాలి. సాగు పరమైన అనుకూల మార్పులపై నిర్ణయాలు తీసుకుంటూనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలవల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వర్తింపజేసే పంటల బీమా సౌకర్యాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాడానికి తగిన జాగ్రత్తలు చేపట్టాలి. ఆలస్యంగా సాగు పనులు ప్రారంభం అవుతుండగా పంటల దిగుబడులపై వివిధ రకాల ఇబ్బందులు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలస్యంగా పంటల సాగు చేసిన రైతులతో పాటు మిగతా రైతులు ప్రస్తుత సమయంలో పంటల ఫసల్ బీమాకు సకాలంలో ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 5,22,178 ఎకరాలు వాన కాలంలో సాగవుతున్నది. ఇందులో మొక్కజొన్న, పత్తి, వరి ప్రధాన పంటలతో పాటు జొన్న, పెసర, కంది, సోయ, మినుములు, పండ్లు, కూరగాయ పంటలు సాగవుతాయి. వర్షాదారంగా సాగయ్యే పంటలకు ఇప్పటికే ఆలస్యమైంది. అనేక ప్రాంతాల్లో ఇంకా దుక్కులు చేసే పనుల్లో రైతులు ఉన్నారు. నారుమళ్లు కూడా ఇంకా పోయలేదు. పంటల సాగు ఆలస్యం అయిన కొద్ది వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడులపై ప్రభావం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు పంటల బీమాను తప్పని సరిగా సద్వినియోగం చేసుకోవడం వల్ల కొంత మేరకు నష్టాల ఇబ్బందుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్ట పరిహారం వెంటనే అందించగా పంటల బీమా పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సంబంధిత సంస్థల నుంచి ఎక్కవ మంది రైతులకు అందే విధంగా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పంటలు సాగు చేస్తున్న రైతులు పనిలో పనిగా తప్పని సరిగా సాగు చేసిన పంటలకు బీమా ప్రీమియం సకాలంలో చెల్లించాలని అధికారులు సూచిస్తున్నారు.

పంటల బీమా ప్రీమియం వివరాలు
ప్రస్తుత వానకాలం సాగు పంటలు మొక్కజొన్న గ్రామ యూనిట్‌గా మిగతా అన్ని పంటలు మండల యూనిట్‌గా గుర్తిస్తున్నారు. అకాల వర్షం, వరదలు, వడగండ్లు, ఇసుక మేటలు, అతివృష్టి, అనావృష్టి కొన్ని రకాల తెగుళ్లు నిబంధనల ప్రకారం వివిధ రకాలుగా పంట నష్టం ఏర్పడినప్పుడు బీమా వర్తిస్తున్నది. పంట వివిధ కారణాల వల్ల నష్టం ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారం ప్రీమియం చెల్లించిన రైతుకు ఈ నష్టం వర్తిస్తుంది.

ఎలా చెల్లించాలి..
పంట రుణాలు కొత్తగా తీసుకున్నా, రెన్యువల్ చేసినా సాగు చేసిన పంటను మాత్రమే నమోదు చేయించుకోవడం తప్పనిసరి. నేరుగా ప్రీమియం చెల్లించే రైతులు పట్టిక అధారంగా ఎన్ని ఎకరాల్లో ఏ పంటలను సాగు చేశారో ఆ మేరకు ప్రీమియం చెల్లించాలి. పంటల బీమా ప్రీమియాన్ని మీ సేవ కామన్ సర్వీస్ సెంటర్లో ఇప్కో టోక్యో ఆన్‌లైన్ ద్వారా ్రwww.pmf b4.gov.1m) బ్యాంకుల్లో ఇప్కో టోక్యో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లి. పేరున చెల్లించాలి. పంట బీమా దరఖాస్తు ఫాంతో పాటు పంట ధృవీకరణ పత్రం పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలు జతచేయాలి.

గడువు జూలై .. పసల్ బీమా ప్రీమియం పత్తికి జూలై 15వ తేదీ కాగా, మిగతా అన్ని పంటలకు ప్రీమియం చెల్లించడానికి జూలై 31 చివరి తేదీ. ఆలోపే రైతులు ప్రీమియం చెల్లించడం పై రైతులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తమ పొలంలో ఏ పంట సాగు చేస్తే ఆ పంటనే పంట రుణాల రైతులు బ్యాంకు అధికారులతో నమోదు చేయించుకోవాలి. చాలా సందర్భాల్లో అధిక అప్పుల కోసం ఎక్కవ వర్తించే పంటలను నమోదు చేయడం వల్ల తాము సాగు చేసిన పంట నష్టానికి గురైనప్పుడు పంట నష్టం పొందలేకపోతున్నారు. మొక్కజొన్న గ్రామ యూనిట్ కాబట్టి ఆ పంట సాగు చేసిన రైతులు తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.

గడువు లోపు ప్రీమియం చెల్లించాలి
జిల్లాలో రైతులందరూ వానకాలం సాగు చేసిన పంటలకు ఫసల్ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీమియం గడువులోపు చెల్లించి సూచించిన నిబంధనల ప్రకారం పత్రాలు జమచేసి సంబంధిత అధికారికి అందించాలి. పొలంలో ఏ పంట సాగు చేస్తే ఆ పంటనే నమోదు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు తప్పని సరిగా బీమా చేయింకోవడం రైతుకు ఎంతో అవసరం. - శ్రావణ్‌కుమార్, జేడీఏ

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...