జిల్లాలో జోరుగా సభ్యత్వాల నమోదు


Sun,July 14, 2019 11:46 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లా వ్యాప్తం గా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పండుగ వాతావరణంలో జో రుగా కొనసాగుతుంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌తోపాటు జనగామ నియోజకవర్గంలో చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల్లో సభ్యత్వ నమోదు కొనసాగుతుంది. ఆయా గ్రామాల్లో పూర్తి చేసిన సభ్యత్వాలను ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఇన్‌చార్జిలకు అప్పగిస్తున్నారు. సభ్యత్వ నమోదుపై స్థానిక శాసన సభ్యులు తన్నీరు హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చే స్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు గజ్వేల్‌లో గ్యాదరి బాలమల్లు, సిద్దిపేట, దుబ్బాకలో వేలేటి రాధాకృష్ణశర్మ, హుస్నాబాద్‌లో బస్వరాజ్‌ సారయ్య, జనగామ ఇన్‌చార్జి సామెల్‌లు ఆయా మండలాల్లో పర్యటిస్తూ సభ్యత్వాలు చేయిస్తున్నారు. కాగా, ఆదివారం సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి సిద్దిపేట రూరల్‌ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల సభ్యత్వ పుస్తకాలు, డబ్బులను సేకరించి ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వగృహంలో పార్టీ ఇన్‌చార్జిలకు జడ్పీటీసీ శ్రీహరి, మాజీ ఎంపీపీ ఎర్ర యాదయ్యలు కలిసి అందజేశారు. హుస్నాబాద్‌ లో ఇన్‌చార్జి బస్వరాజ్‌ సారయ్య, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌లు పర్యటించి సభ్యత్వాలు చేయించారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...