ప్రశంసలందుకుంటున్న కస్తూర్బాగాంధీ పాఠశాల


Sun,July 14, 2019 11:46 PM

మిరుదొడ్డి : మండల కేంద్రమైన మిరుదొడ్డిలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల/కళాశాలలో 2019-2020 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించడానికి 6వ తరగతిలో 45 మంది, 7వ తరగతిలో 45 మంది, 8వ తరగతిలో 41 మంది, 9వ తరగతిలో 44 మంది,10వ తరగతిలో 38 మంది విద్యార్థులు కలిపి మొత్తం 213 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 213 మంది విద్యార్థులుకుగాను ప్రిన్సిపాల్‌తో సహా 8మంది ఉపాధ్యాయులు, వివిధ రకాల ఆటలు ఆడించడానికి ఒక పీఈటీ, విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వెంటనే మందులందించడానికి ఒక నర్సు (ఏఎన్‌ఎం), ఒకేషనల్‌ టీచర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్‌ విద్య ప్రారంభం
10వ తరగతి వరకు విద్యనందిస్తున్న కస్తూర్బా గాంధీ పాఠశాలలోనే ఇంటర్మీడియట్‌ వరకు విద్యనందించాలనే ధృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులను ప్రారంభించింది. దీంతో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూపులో 35 మంది, నర్సు ట్రైనింగ్‌ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) గ్రూపులో 40 మంది రెండు గ్రూపుల్లో మొత్తం 75 మంది విద్యార్థులు ఈ ఏడు విద్యనభ్యసిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు 6 మంది ఉపాధ్యాయులు విద్యా బోధనలు చేస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
పాఠశాల సమయం ముగియగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు సాయంత్రం 6 గంటల భోజనం అనంతరం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు విద్యార్థులకు ప్రతీ రోజు ఒక్కో సబ్జెక్టు పై ప్రత్యేక తరగతులను రోజు ఒక్కో ఉపాధ్యాయురాలు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 2013-14, 2014-15, 2018-19వ విద్యా సంవత్సరాల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించి మంచి ఫలితాలను రాబట్టారు. 10 తరగతిలో పాసైన కస్తూర్భాంగాంధీ విద్యార్థులే నేడు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో విద్యనభ్యసిస్తున్నారు.
తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను తమ పిల్లలుగా అక్కున చేర్చుకొని వారి ఆలనాపాలన చూస్తూ విద్యా బోధనలు చేస్తూ విద్యార్థుల చేత మన్ననలు పొందిన కస్తూర్భా గాంధీ ఉపాధ్యాయులను మండల పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. బాలికల నుంచి విద్యతో పాటు వివిధ రంగాల్లో మరిన్ని మంచి ఫలితాలను రాబట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...