అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి


Sun,July 14, 2019 11:46 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించారు. ఆదివారం దుబ్బాకలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఎమ్మెల్యే రామలింగారెడ్డి పరిశీలించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కాలనీలో సమ్మక్క-సారలమ్మ దేవాలయ నిర్మాణం కోసం స్థలాన్ని మరోసారి ఆయన పరిశీలించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పక్కనే ఉన్న రైతుల స్థలంలో దేవాలయాన్ని నిర్మిస్తే బాగుంటుందని పూజారులు సూచించారు. వారి సూచనల మేరకు ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంబంధిత రైతులతో చర్చించారు. ఆలయానికి కావాల్సిన స్థలాన్ని ఇచ్చేందుకు రైతులు తమ సమ్మతిని తెలిపారు. త్వరలోనే సమ్మక్క-సారలమ్మ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే సూచించారు.
దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. దుబ్బాక పట్టణంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయన్నారు. ఇందుకు స్థానిక నాయకులు, ప్రజల సహకారం మరిచిపోలేని దన్నారు.

దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు భారీగా కేటాయించిందన్నారు. దుబ్బాకలో ఇండ్లు లేని నిరుపేదల కోసం వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అర్హులైన నిరపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేసి వారి సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. పేదల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. దుబ్బాక మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు, మురికి కాల్వలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌, కేసీఆర్‌ స్కూల్‌, వంద పడకల దవాఖాన తదితర భవనాల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. దుబ్బాకలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రజలకు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేందుకు సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. దేవాలయానికి కావాల్సిన స్థలాన్ని రైతులు ఇచ్చేందుకు ముందుకు వచ్చినందుకు ఎమ్మెల్యే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ మాజీ చైర్మన్‌ గుండెల్లి ఎల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రొట్ట్టె రమేశ్‌, ఆస స్వామి, అస్క రవి, పర్స కృష్ణ, నర్సింహారెడ్డి, తదితరులు ఉన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...