‘కాళేశ్వరం’ తెలంగాణ వరప్రదాయిని


Sun,July 14, 2019 11:46 PM

-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-ప్రాజెక్టు సందర్శనకు తరలిన మూడు వేల మంది నాయకులు
చేర్యాల, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ తన మేధోశక్తిని రంగరించి ఆధునిక సాంకేతికను వినియోగించుకుని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు.ఆదివారం జనగామ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తరలివెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తలతో చేరుకున్న కొద్ది క్షణాల్లోనే.. సీఎం కేసీఆర్‌, సీసీ కెమెరాల ద్వారా చూసి.. వెంటనే ముత్తిరెడ్డికి ఫోన్‌ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత, ప్రస్తు త నీటిమట్టం తదితర విషయాలను మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో కలిగే ప్రయోనాలను నేరుగా నాయకులకు తెలియడానికి ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో రైతుల్లో మనోధైర్యం పెరిగిందని, గోదావరి నీటిని ఎదురు ప్రవహింపజేసిన ఘనత చరిత్రలో మీకే దక్కుతుందని, సదా తెలంగాణ ప్రజలు మీకు రుణపడి ఉంటారని’ సీఎంతో ఫోన్‌లో ఎమ్మెల్యే.. అన్నారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు, కన్నెపల్లి పంపు హౌస్‌, అన్నారం బ్యారేజ్‌ తదితర వాటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ర్టానికి వరప్రదాయినిగా మారిందన్నారు. కరువు ప్రాంతమైన జనగామ నియోజకవర్గానికి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కరుణాకర్‌, తలారి కీర్తన, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, చిలువేరు సిద్దప్ప, మండ ల అధ్యక్షులు శ్రీధర్‌రెడ్డి, భిక్షపతి, మలిపెద్ది మల్లేశం, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్లు తాడెం రంజితాకృష్ణమూర్తి, మేక సంతోష్‌, సద్ది కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌, నాయకులు సుంకరి మల్లేశం, మంద యాదగిరి, పుర్మ ఆగంరెడ్డి, ముత్యం నర్సింహులు, మెరుగు కృష్ణ తదితరులున్నారు.
ప్రాజెక్టు సందర్శనకు తరలిన నాయకులు
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల టీఆర్‌ఎస్‌ నాయకులు తరలివెళ్లా రు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లు నీటితో కళకళలాడుతున్న దృశ్యాలను చూసి ఆనందం చెందారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...