సభ్యత్వ నమోదులో గులాబీ శ్రేణుల దూకుడు


Sat,July 13, 2019 10:58 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం జనగామ నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్నది. నియోజకవర్గానికి పార్టీ నిర్ణయించిన 60వేల సభ్యత్వాలను ఇప్పటికే పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. మరో 25వేల మంది సభ్యత్వాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదులో దూకు డు ప్రదర్శిస్తున్నాయి. ఎమ్మె ల్యే యాదగిరిరెడ్డి పట్టణంలోని రేణుక గార్డెన్స్‌లో జూన్ 30వ తేదీన మూడు మండలాల సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమో దు పుస్తకాలు అందజేశారు. పిదప నాటి నుంచి నేటి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఎమ్మెల్యే పర్యవేక్షణ పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో జనగామ పరిశీలకులు మందుల సామెల్ పరిశీలనలో పార్టీ మండల అధ్యక్షుడడు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మలిపెద్ది మల్లేశం, గీస భిక్షపతిలతో పాటు ఆయా మండలాల ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తన, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, చిలువేరు సిద్దప్పలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు నమోదు సమీక్షిస్తున్నారు.

20 వేల సభ్యత్వాల నమోదు పూర్తి...
నియోజకవర్గంలో ఎప్పుడూ గట్టి పట్టు ఉండే చేర్యాల ప్రాంతంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన ఉంది. పార్టీ నిర్ణయించిన సభ్యత్వాలకు డబుల్‌గా కార్యకర్తలు సభ్యత్వాలు స్వీకరిస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీ, చేర్యాల మండలం, కొమురవెల్లి, మద్దూరు మండలాలలో ఇప్పటివరకు 20వేల సభ్యత్వాలు పూర్తి చేశారు. చేర్యాలలో 3వేల క్రియాశీల, మద్దూరులో 2వేల క్రియాశీల, కొమురవెల్లిలో 1500 క్రియాశీల సభ్యత్వాలు తీసుకున్నారు. సభ్యత్వ నమోదు పూర్తి చేసిన ఫారాలను నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లలో వాటిని నిత్యం డాటా ఎంట్రీ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన సభ్యత్వాలే కాకుండా మరో 5వేల మంది సభ్యత్వాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదు సందర్భంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలు, వాటి డబ్బులను అందించి రసీదులను తీసుకుంటూ పార్టీ నాయకులు క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...