హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తా


Fri,July 12, 2019 11:46 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తా.. పిల్లలతో కలిసి భోజనం చేస్తా.. అక్కడే నిద్ర చేస్తా.. ఆయా హాస్టళ్లలో ఏమైన సమస్యలుంటే వెనువెంటనే పరిష్కరించండి.. నేను వెళ్లినప్పుడు విద్యార్థులు సమస్యలు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హాస్టల్ వార్డెన్లకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. వసతి గృహాల్లో చదివే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి హాస్టల్ వార్డెన్‌పై ఉందన్నారు. వసతి గృహాల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగాలని, అడ్మిషన్లకు మరో వారం రోజులు గడువు పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజాశర్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ సరోజ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జీవరత్నం, ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, హాస్టల్ వార్డెన్లతో సుదీర్ఘంగా సమీక్షించా రు. ఆయా హాస్టళ్లలో నెలకొ న్న సమస్యలపై ఆరా తీస్తూ వాటికి పరిష్కార మార్గాలు చూపారు. అక్కడికక్కడే సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర గురుకుల పాఠశాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ విజయ్‌భాస్కర్‌తో ఫోన్‌లైన్‌లో మాట్లాడి సిద్దిపేట మైత్రివనంలో ఉన్న ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎన్సాన్‌పల్లికి షిప్టు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్ని వసతులు సమకూర్చుతానన్నారు. వారం రోజుల్లో బీసీ, ఎస్సీ బాలికలకు అదనంగా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. పది రోజుల్లో బాలికలకు అదనంగా హాస్టల్స్ బీ పేరిట ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. ఈ నెల రోజుల్లో తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని చెప్పారు. వసతి గృహాల్లో అడ్మిషన్లపై వార్డెన్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. కొందరు వార్డెన్ల పనితీరు సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

చింతమడక బీసీ రెసిడెన్షియల్‌కు రూ.5 కోట్లు
సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు రూ.5 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆయా వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు యోగా నేర్పించాలని సూచించారు. అడవులపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట శివారులో నాగులబండ వద్ద అర్బన్ పార్కును సందర్శించాలని వార్డెన్లకు సూచించారు. ప్రతి హాస్టల్ విద్యార్థి 10/10 జీపీఏ సాధించేలా కృషి చేయాలన్నారు.

చేర్యాల రెసిడెన్షియల్ పాఠశాలలు సిద్దిపేటకు మార్చాలి
ప్రస్తుతం చేర్యాలలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూల్‌ను యదావిధిగా సిద్దిపేటకు తేవాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకు కావాల్సిన తాత్కాలికంగా భవనం సిద్ధంగా ఉందని, అధికారులు ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...