కొనసాగుతున్న నట్టల నివారణ మందు పంపిణీ


Wed,June 19, 2019 11:29 PM

దుబ్బాక: నియోజకవర్గంలో వానకాలం సీజన్‌లో గొర్రెలు, మేకలకు వచ్చే నట్టల వ్యాధి నివారణ కోసం పశువైద్య అధికారులు గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. బుధవారం దుబ్బాక మండలం చిన్న నిజాంపేటలో గొర్రెలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ప్రతి గొర్రెల కాపలాదారులు కార్యక్రమం వినియోగించుకోవాలని వైద్యులు శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా 3,479 గొర్రెలకు, 158 మేకలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ శేర్ల రచన కైలాస్, ఎంపీటీసీ మంగళగిరి అంజమ్మ హరిబాబు, ఉపసర్పంచ్ పర్శరాములు, సంఘం అధ్యక్షుడు చింతాకుల కనకయ్యల సిబ్బంది పాల్గొన్నారు.
నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం
చేసుకోవాలి...
తొగుట: వర్షాకాలంలో నట్టల మూలంగా గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురవుతాయని, ముందస్తుగా నట్టల నివారణ మందులు వాడితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తొగుట పశువైద్యుడు రాజేందర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని వేములఘాట్, కాన్గల్‌లో బుధవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేములఘాట్‌లో 3045 గొర్రెలకు, 729 మేకలకు, కాన్గల్‌లో 1795 గొర్రెలకు, 401 మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు రాజేందర్‌రెడ్డి, నిహారిక, సిబ్బంది తార, భూపాల్, సర్పంచ్‌లు సిద్దిపేట బాలయ్య, మాదవరెడ్డి గారి ప్రేమల చంద్రారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం సిద్దిపేట అధ్యక్షుడు సిద్దిపేట ఎల్లం, నాయకులు అంజయ్య పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...