అభివృద్ధి, సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పెద్దపీట


Tue,June 18, 2019 11:42 PM

రాయపోల్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్‌ మండలం గొడుగుపల్లి నుంచి రాయిని చెరువు తండాకు రూ.46 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే దౌల్తాబాద్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 85 మంది కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాయపోల్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. శేరుపల్లిబందారం గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ శాఖలలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా ఉపేక్షించేదిలేదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే ప్రజలు మీడియా ద్వార కానీ, వ్యక్తిగతంగా కానీ తెలిపితే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలోని బీటీ రోడ్ల మరమ్మతులు ముమ్మరంగా జరుగుతున్నాయని, కొత్తగా లింక్‌ రోడ్లకు నిధులు మంజూరీ కాగా వాటి పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అబ్బగౌని మంగమ్మ, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల నూతన జడ్పీటీసీ రణం జ్యోతి, లింగాయపల్లి యాదగిరి, తహసీల్దార్‌ వాణిరెడ్డి, దౌల్తాబాద్‌ సర్పంచ్‌ వెంకన్న, శేరుపల్లిబందారం ఎంపీటీసీ నవీన్‌, మండల రైతు సమితి అధ్యక్షుడు స్టీవాన్‌రెడ్డి, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్‌గౌడ్‌, వెంకటేశ్వర శర్మ, జిల్లా పరిషత్‌ కో-అప్షన్‌ సభ్యుడు రహిమొద్దీన్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...