నేడు నారాయణఖేడ్‌కు హోంమంత్రి మహమూద్‌ అలీ రాక


Tue,June 18, 2019 11:42 PM

నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోగమిస్తుండగా ఖేడ్‌లో నూతన పోలీస్‌స్టేషన్‌ భవనం ఏర్పాటుతో మరో ముందుడుగు పడినైట్లెంది. కోటి రూపాయల నిధులతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. బుధవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందు కోసం సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేవిధంగా పట్టణంలో ఆర్టీసీ డిపో పక్కన గల స్థలంలో డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి హోంమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక శెట్కార్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన ఈద్‌మిలాప్‌ కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొననున్నారు. కాగా హోంమంత్రి మహమూద్‌అలీ, స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నారాయణఖేడ్‌ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసు అధికారులతో సమీక్షించారు. ఆయనవెంట డీఎస్పీ సత్యనారాయణరాజు, సీఐ వెంకటేశ్వర్‌రావు, స్థానిక ఎస్‌ఐ సందీప్‌, ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు ఉన్నారు.
తొలుగనున్న ఇబ్బందులు
నారాయణఖేడ్‌లో దశాబ్దాల క్రితం నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనంతో పోలీసు సిబ్బంది పడుతున్న ఇబ్బందులు నూతన భవన నిర్మాణంతో తొలిగిపోనున్నాయి. ఆధునిక హంగులతో నిర్మించిన నూతన భవనంతో అన్ని సౌకర్యాలు అందుబాలోకి రానున్నాయి. అదేవిధంగా నారాయణఖేడ్‌లో నూతనంగా డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుండడంతో దానికి పక్కా భవనం నిర్మించడం అనివార్యమైంది. ఈ మేరకు స్థానిక ఆర్టీసీ డిపో పక్కన గల ప్రభుత్వ స్థలంలో డీఎస్పీ కార్యాలయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...