పెద్దమ్మతల్లి దయతో వర్షాలు సమృద్ధిగా కురువాలి


Tue,June 18, 2019 11:41 PM

-కాలువల్లో గోదావరి జలాలు పారాలి
-సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు
-నారాయణరావుపేట మండలం మాటిండ్లలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
నంగునూరు : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నంగునూరు మండలంలోని ప్రతి గ్రామంలో కాలువలు నిర్మించుకున్నామని.. పెద్దమ్మతల్లి దయతో ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి మన కాలువల్లో గోదావరి జలాలు పారాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన నంగునూరులో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఉత్సవాల్లో పా ల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎక్కడా లేని విధంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ నుంచి రూ.25 లక్షలతో ఆలయాన్ని నిర్మించామన్నారు. ముదిరాజ్‌ల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేసి పెండ్లిళ్లు చేసుకునే విధంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. గ్రామాల్లోని ప్రతి కాలువకు రెండు వైపులా ప్రభుత్వ భూమి ఉంటుందని, ఈ వర్షాలు పడేలోపు నియోజకవర్గంలోని ముదిరాజ్‌ కులస్తులందరికీ ఉచితంగా సీతాఫలం మొక్కలు ఇస్తామన్నారు. ఈ మొక్కలను కాలువలకు ఇరువైపులా నాటించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సోంరెడ్డి, నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ తడిసిన ఉమ, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్‌ కిష్టారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రమేశ్‌, ఎంపీటీసీ జైపాల్‌రెడ్డి,నాయకులు దువ్వల మల్లయ్య, సంగు పురేందర్‌, కోల మహేందర్‌, మంత్రి రాంరెడ్డి, చెలికాని మల్లేశం, ముదిరాజ్‌ సంఘం నాయకులు కొండిల్ల సాయిలు, సొప్పరి శ్రీనివాస్‌, బీమరి కనకరాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, తదిరులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...