గ్రామాల అభివృద్ధ్ధికి ప్రభుత్వం కృషి


Tue,June 18, 2019 11:41 PM

మద్దూరు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అ నేక కార్యక్రమాలను చేపడుతుందని తాజా ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని గాగిళ్లాపూర్‌లో సర్పం చ్‌ బొల్లు కృష్ణవేణి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించుకొని, గ్రామ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలత, ఎంపీటీసీ గూళ్ల సత్యకళలను పంచాయతీ పాలకవర్గం, గ్రామైక్య సంఘాల సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ మేక సంతోశ్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ మేక మాధవి, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు సత్యనారాయణ, బాలరాజు, నర్సింహాస్వామి, కనకవ్వ, బాలవ్వ, ఐలవ్వ, నీల, బాలకృష్ణ, మహేందర్‌ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...