మూగ జీవాల సంరక్షణే సర్కార్‌ ధ్యేయం


Tue,June 18, 2019 11:41 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్ర భుత్వం మూగ జీవాల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు ప్రా రంభించిందని పశు సంవర్ధక శాఖ చేర్యాల ఏడీ దేవేందర్‌ తెలిపారు. గొర్రెలు, మేకల సంరక్షణ కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన నట్టల నివారణ మందు సరఫరా కార్యక్రమాన్ని చేర్యాల పట్టణంలోని యాదవనగర్‌లో మంగళవారం ఏడీ ఆధ్వర్య ంలో పశు సంవర్ధక శాఖ వైద్యులు విజయసారధి, ఆర్‌.పి.సింగ్‌ నట్టల నివారణ మందును గొర్రెలు, మేకలకు అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఏడీ, మండల పశు వైద్యాధికారులు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు చేర్యాల, కొమురవెల్లి మండలాల్లోని అన్ని గ్రామాల్లో నట్టల నివారణ మందులను అందజేయనున్నట్లు తెలిపారు.

బుధవారం చేర్యాల మండలంలోని ము స్త్యాల, వీరన్నపేట, కొమురవెల్లి మండల కేంద్రంలో జీవాల కు మందులను అందజేస్తామన్నారు. నట్టల నివారణ మం దులను మూగ జీవాలకు సకాలంలో అందించడం వల్ల వాటి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారు లు సైతం వాటి సంరక్షణ కోసం ప్రత్యేక పద్ధతులు అవలభించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అందజేసిన జీవాలతో గొర్రెలు, మేకల పెంపకందారుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందని, ఆర్థికంగా వారు మ రింత బలోపేతం అవుతున్నారని తెలిపారు. జీవాలు అనారోగ్యాలకు గురైతే వెంటనే పశు వైద్యాధికారులను సంప్రదించాలని, ప్రభుత్వం పంపిణీ చేసే మందులను సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. ఆ యా గ్రామాల్లో నిర్వహించే న ట్టల నివారణ మందు సరఫరా కార్యక్రమానికి వి ధిగా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు హా జరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ము నర్సింగరావు, గొ ర్రెల, మేకల పెంపకందారులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

గొర్రెల పెంపకానికి ప్రత్యేక కృషి
కొమురవెల్లి : గొల్లకురుమల సంక్షేమం కోసం సబ్సిడీపై గొ ర్రె లు పంపిణీ చేయడంతో పాటు గొర్రెల పెంపకానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని వెటర్నిటీ డాక్టర్‌ విజయసారథి అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో సర్పంచ్‌ బొడిగం పద్మతో కలిసి గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి పత్యేక కృషి చేస్తుందన్నా రు. కేవలం గొర్రెలు పంపిణీ చేసి వదిలిపెట్టకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, దానిలో భాగంగా గొర్రెలకు దాన సంచులు అందజేస్తుందన్నారు. రోగాల బారిన పడిన గొర్రెలను రక్షించేందుకు మూగజీవాలకు సైతం ప్రభుత్వం అంబులెన్స్‌ సౌకర్యం కల్పించి ఉచిత మందులు అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో గోపాల్‌మిత్ర వెంకట్‌రెడ్డి ఉపసర్పంచ్‌ పర్శరాములు, బాలమణి, ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...