పేద పిల్లలకు ఉన్నత విద్యే లక్ష్యం


Mon,June 17, 2019 11:27 PM

దుబ్బాక, నమస్తే తెలంగాణ: పేద పిల్లలందరికీ ఉన్నత వి ద్య అందించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సర్కారు కృషి చేస్తు న్నదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పేర్కొ న్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో పేద పి ల్లలకు విద్యనందించేందుకు గురుకులాలు, వసతి గృహాల ను ఏర్పాటు చేసిందన్నారు. సోమవారం దుబ్బాక మండ లం హబ్షీపూర్‌లో బీసీ గురుకుల(మహాత్మా జ్యోతిబా ఫూ లే) పాఠశాలను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రారంభించారు. కా ర్యక్రమానికి వచ్చిన కలెక్టర్‌కు ఎమ్మెల్యే సోలిపేట మొక్కను అందజేయగా, విద్యార్థులు కలెక్టర్, ఎమ్మెల్యేకు స్వాగతం ప లికారు. ఆనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో అంబేద్క ర్, మహాత్మా జ్యోతి బాపూలే వంటి మహానీయులను స్మ రించుకునేందుకు సీఎం కేసీఆర్ గురుకులాలను ప్రారం భించారన్నారు. తెలంగాణ సర్కారులోనే గ్రామీణ పేదలకు ఖరీదైన విద్య ఉచితంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా సొంత పిల్లలుగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. గురుకుల విద్యార్థులు మంచిగా చదివి, భవిష్యత్‌లో రాణించాలని కోరారు.

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్
విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్న ఉద్దేశంతో సీ ఎం కేసీఆర్ విద్యకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారని కలె క్టర్ వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు బడుల కంటే స ర్కారు బడుల్లోనే సకల వసతులతో కూడిన గుణాత్మక విద్య అందుతుందన్నారు. బీసీ విద్యార్థులకు గుణాత్మక విద్యనం దించేందుకు సీఎం కేసీఆర్ 119 గురుకులాలు ప్రారంభిం చడం అభినందనీయమన్నారు. విద్య ఒక పెట్టుబడిలాంటిద ని, విద్యతోనే ఆ విద్యార్థికి, ఆ కుటుంబానికి సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. గతంలో ఆర్డీవోగా పని చేసిన స మయంలో వసతిగృహాలను సందర్శించిన సమయాల్లో నా సిరకం భోజనంతో పాటు సరైన వసతులు ఉండేవి కావని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం వసతి గృహాల్లో రుచికర భోజనంతో పాటు ఎన్నో వసతులున్నాయన్నారు. ఈ కార్య క్రమంలో సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, బీసీ వెల్ఫేర్ జి ల్లా అధికారి సరోజ, దుబ్బాక ఎంపీపీ ర్యాకం పద్మాశ్రీరా ములు, సర్పంచ్ శ్రీనివాస్, ఎంఈవో ప్రభుదాస్, గురుకుల ప్రిన్సిపాల్ నాగరాజు, టీఆర్‌ఎస్ నాయకులు పంజాల కవితా శ్రీనివాస్, రణం జ్యోతీశ్రీనివాస్, తౌడ శ్రీనివాస్, అస్క రవి, ఆస స్వామి, రొట్టే రమేశ్, ఎల్లారెడ్డి, పర్స కృష్ణ, నారాగౌడ్, కనకయ్య, భూంరెడ్డి, తదితరులున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...