గురుకులాలను వినియోగించుకోవాలి


Mon,June 17, 2019 11:26 PM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్న వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాలను బీసీ వర్గాల్లోని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో కె అనంతరెడ్డి అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణ శివారులోని పోతారం(ఎస్)లో మహాత్మా జ్యోతీరావుఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు గురుకుల విద్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి పిల్లలకు కూడా ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యనందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గురుకులాలను స్థాపిస్తున్నారని, వీటిని వినియోగించుకొని పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలని సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థల కంటే మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం ఈ గురుకులాల ద్వారా అందిస్తున్నారన్నారు. ఐదో తరగతి నుంచి ఇందులో చదువుకునే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ఈ గురుకులాల్లో చేర్పించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివించి ఆర్థికంగా నష్టపోయేకంటే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గురుకులాల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అభ్యసించాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన ఉచిత విద్యను అందించడం అనేది గొప్ప సంకల్పమన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, విద్యార్థులు కూడా క్రమశిక్షణతో చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బత్తిని సాయిలు, ఎంపీటీసీ బొమ్మగాని శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...