విద్యా వ్యవస్థలో పటిష్ట మార్పులు


Mon,June 17, 2019 11:26 PM

గజ్వేల్ టౌన్: తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ప టిష్ఠ మార్పులు తెచ్చిందని, గ్రామీణ ప్రాంత పేద విద్యార్థుల ను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ గురకుల పాఠశాలలను స్థాపించారని సిద్దిపేట జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ పే ర్కొన్నారు. సోమవారం ప్రజ్ఞాపూర్‌లో మహాత్మ జ్యోతిరా వు పూలే బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంత పేద వి ద్యార్థుల తల్లిదండ్రుల బాధ్యతను ప్రభుత్వం తీసుకొని, వా రి కోసం యేటా రూ. 1.20 లక్షలను ఖర్చు చేస్తున్నదన్నా రు. సకల వసతులతో స న్న బియ్యంతో భోజనం, విద్యార్థులకు దుస్తువులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసి, నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ యేడు జిల్లాలో మూడు గురుకులాలను ఏర్పాటు చేయ డం సంతోషకరమన్నారు. ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు సమాజంపై అవగాహన ఉండదని, ఒకటి, రెం డు పాఠ్యపుస్తకాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తారన్నారు. ప్రాథమిక విద్యపై ఎక్కువ శ్రద్ధను ఉపాధ్యాయులు చూపించాలని, విద్యార్థుల మనసు ఎరిగి, వారికి అనుగుణంగా బోధన చే యాలన్నారు. విద్యవ్యవస్థను పటిష్ఠం చేయడమే సీఎం లక్ష్యమన్నారు.

గురుకుల విద్యార్థులను భావి పౌరులుగా అందించాలి : కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులను భావి పౌరులుగా అందించాలని, క్రమశిక్షణతో పెంచాలని, అప్పుడే వారు భవిష్యత్‌లో స్థిరపడే అవకాశముంటుందని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. మంచి బోధనతో ఉత్తమ విద్యార్థు లు ఎదిగిన గురుకుల కళాశాల విద్యార్థులను అభినందించా రు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా జిల్లాలోని గజ్వేల్, దుబ్బా క, సిద్దిపేట ప్రాంతాల్లో నేడు మూడు గురుకుల పాఠశాలలను పేదల కోసం ప్రారంభించడం వారి అదృష్టమన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థులను కాంపిటీటివ్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు మాత్రమే ఉపయోగపడుతాయన్నారు. ర్యాంకుల కోసమే బోధన చేస్తారే తప్పా, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని చేయరన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తల్లిదంద్రుల్లా చూసుకొని, దగ్గరకు తీసుకొని, వారికి అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు. గురుకులాల్లో ఎలాంటి సమస్యలున్నా, తన దృష్టికి తేవాలన్నారు. అనంతరం పాఠశాల, కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకు ముందు జడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్‌కు విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి, పు డ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ భూపతిరెడ్డి, వైస్ చైర్మన్ అరుణభూపాల్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి సరోజ, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో జయదేవ్, నాయకులు రాధాకృష్ణాశర్మ, యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ పట్టణాఅధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రావు, శోభారాణి, కళాశాల ప్రిన్సిపల్ భీష్మచారి తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...