ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Mon,June 17, 2019 11:26 PM

హుస్నాబాద్‌రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మండల విద్యాధికారి ఎం అర్జున్ అన్నారు. మండలంలోని కూచనపల్లి, మాలపల్లి, బంజేరుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వం విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందన్నారు. స్థానికంగా ఉండే బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు తమ పిల్లలను పంపించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. దేశంలో గొప్ప వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనని గుర్తుచేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కేసిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాలస్వామి తిరుమల్‌రెడ్డి, బత్తుల మల్లయ్య, ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కేశవాపూర్‌లో
అక్కన్నపేట : మండలంలోని కేశవాపూర్‌లో సోమవారం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంత రం ఉపాధ్యాయులు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజ్‌మహ్మద్, బీ సమ్మయ్య, జీ దామోదర్, శంకరయ్య, శ్రీలత, నర్సింహాస్వామి, శ్రీనివాస్, సర్పంచ్ రాజేశం, సీఆర్‌పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కోహెడలో..
కోహెడ : మండలంలోని కూరెల్ల, నారాయణాపూర్, శ్రీరాములపల్లి, ఆరెపల్లి, శనిగరం,లంబాడి తండా, చంద్రనాయక్ తండా గ్రామాల్లో సోమవారం ఎంఈవో మారంపల్లి అర్జున్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించారు. కూరెల్లలో సర్పంచ్ గాజుల రమేశ్ ఆద్వర్యంలో అంగన్‌వాడీలు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అలాగే నారాయణాపూర్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎన్నికైన వైస్ ఎం పీపీ తడ్కల రాజిరెడ్డి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చే శారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ కర్ర రవీందర్, సర్పంచ్‌లు ముంజ మంజుల, కర్ర జయశ్రీ, అన్నవేని కనకయ్య, లా వుడ్య సరోజన, ఉప సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...