గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం


Mon,June 17, 2019 11:25 PM

కొమురవెల్లి: గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని సర్పంచ్ తాడూరి రవీందర్ అన్నాడు. సోమవారం మండలంలోని రాంసాగర్‌లో ఇంటింటికి ఇంకుడుగుంత పేరుతో ఈ కార్యక్రమానికి భూమి పూజ చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికీ ఇంకుడుగుంతను నిర్మించుకోవాలని కోరారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు గ్రామం శుభ్రంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉపసర్పంచ్ అక్కెనపల్లి విజయ, వీఆర్‌వో వినయ్, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, వార్డుసభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...