ఘనంగా జయశంకర్ బడిబాట


Mon,June 17, 2019 11:25 PM

చేర్యాల, నమస్తే తెలంగాణ: ప్రొ. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాల, ఎస్సీ కాలనీల ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసంను నిర్వహించారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంఈవో రాములు అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, ఎస్‌ఎమ్‌సీ చైర్మన్ కొంక శశిధర్, కాంప్లెక్స్ హెచ్‌ఎం ఐలయ్య, హెచ్‌ఎం లింగారెడ్డి, ఉపసర్పంచ్ పద్మ, ఎస్‌ఎమ్‌సీ సభ్యులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నోటు పుస్తకాల పంపిణీ
పట్టణంలోని కురుమవాడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శివకుమార్, అలువాల చిర్రయ్య గార్ల ఆర్థిక సహకారంతో రూ. 7వేల విలువ గల నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను 60మంది విద్యార్థులకు ఎంఈవో రాములు చేతుల మీదుగా సోమవారం అందజేశారు. పాఠశాలలో విద్యార్థులకు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులను పేద విద్యార్థులకు అందజేయడం అభినందనీమని ఎంఈవో అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఎన్. లక్ష్మయ్య, ఉపాధ్యాయులు వాణిశ్రీ, కాంప్లెక్స్ హెచ్‌ఎం లక్ష్మి, సీఆర్పీ ఎల్లమ్మ, దాతలు చిర్రయ్య, శివకుమార్, అంగన్‌వాడీ టీచర్ వీరమణి పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...