ప్రభుత్వ బడిలోనే గుణాత్మక విద్య


Mon,June 17, 2019 11:25 PM

రాయపోల్: విద్యార్థులను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తున్నామని సిద్దిపేట జిల్లా విద్యాశాఖాధికారి రవికాంతారావు పేర్కొన్నారు. సోమవారం ఆయన రాయపోల్, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన సాముహిక అక్షరాభ్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇప్ప దయాకర్, కొత్తపల్లి ఉపసర్పంచ్ మల్లేశం సంయుక్తంగా పాఠశాలకు 20వేల విలువైన కంప్యూటర్‌ను బహుకరించారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో సెక్టోరియల్ ఆధికారి రమేశ్, ఎంఈవో నర్సమ్మ, సర్పంచ్‌లు రంగవ్వ, మౌనిక రాజిరెడ్డి, హెచ్‌ఎంలు నాగరాజు, అబ్దుల్లా, మండల టీఆర్‌ఎస్ కన్వీనర్ వెంకటేశ్వరశర్మ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రఘోత్తంపల్లిలో సామూహిక అక్షరాభ్యాసం
దుబ్బాక,నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పేదలకు వసతులతో కూడిన గుణ్మాతక విద్య అందుతున్నదని దుబ్బాక మండలం ఆకారం ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాగౌడ్ అన్నారు. సోమవారం ఆకారం ఎంపీటీసీ పరిధిలోని రఘోత్తంపల్లి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రెడ్డి దేవిరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఆనంతరం పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే పేదలందరికీ గుణాత్మక విద్యనందించేందుకు సంక్షేమ పాఠశాలలు, గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయి నుంచే అర్థవంతమైన విద్యనందించేందుకు అంగన్‌వాడీ, ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వసతులు కల్పించిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఆరెపల్లి పాఠశాలలో...
మిరుదొడ్డి: ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులే నేడు దేశంలో మహోన్నతమైన పదవుల్లో ఉన్నారని మిరుదొడ్డి ఎంఈవో జోగు ప్రభుదాస్ అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండల పరిధిలోని ఆరెపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. మండంలోని అన్ని గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు కాకుండా ప్రభుత్వ బడులకే పంపాలని ఎంఈవో కోరారు. అన్ని గ్రామాల ప్రజలు ఆరెపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్ల సత్యనారాయణ, మిరుదొడ్డి కాంప్లెక్స్ హెచ్‌ఎం కొత్త రాజిరెడ్డి, పాఠశాల హెచ్‌ఎం రాజ్యలక్ష్మి, పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

లింగాపూర్ పాఠశాలలో...
తొగుట: చిట్టి పొట్టి చేతులతో చిన్నారుల అక్షరాభ్యాస కార్యక్రమం తొగుట మండలంలోని పలు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో జరిగింది. చందాపూర్‌లో గజ్వేల్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 1వ తరగతి విద్యార్థులకు ఉచితంగా పలకా, బలపాలు అందించారు. గ్రామ సర్పంచ్ బొడ్డు నర్సింలు ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. లింగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ బిక్కనూరి రజిత శ్రీశైలం ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

పెద్దమాసాన్‌పల్లిలో...
పెద్దమాసాన్‌పల్లిలో జరిగిన అక్షరభ్యాస కార్యక్రమంలో సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామితో కలిసి తొగుట జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించారు. గ్రామానికి చెందిన కంది వెంకట్‌రెడ్డి జ్ఞాపకార్థం అతని కుమారులు మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కుమార్తె అల్లుడు మాధవి, లకా్ష్మరెడ్డి (డీఆర్‌డీవో రంగారెడ్డి) ఉచితంగా అందించిన పుస్తకాలను వారు పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సుమలత కనకయ్య, నాయకులు కంది రాంరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కంది ముత్యంరెడ్డి, సుతారి రమేశ్ పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...