25న గోపాలమిత్రలకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ


Mon,June 17, 2019 12:15 AM

సిద్దిపేట అర్బన్ : ఈ నెల 25న మెదక్ జాల్లా కేంద్రంలో పశుసంవర్ధ్దక శాఖ, పశుగణాభివృద్ధ్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి గోపాల మిత్రలకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు అధికసంఖ్యలో గోపాలమిత్రలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధ్ద్దిసంస్థ చైర్మన్ లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట విజయ డెయిరీలో ఉమ్మడి మెదక్ జిల్లా గోపాలమిత్ర సూపర్‌వైజర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ..గోపా లమిత్రల శిక్షణ సదస్సుకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరవుతారన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా 1300 మంది గోపాలమిత్రలు రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 121 మంది గోపాల మిత్ర లు, ఐదుగురు సూపర్‌వైజర్లు పని చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల 18 వేల పాడిపశువులకు ఇనాఫ్ ట్యాగింగ్ కార్యక్రమం పూర్తి చేశారన్నారు. పాడిరైతులకు మ రింత మెరుగైన సేవలందించేందుకు గోపాలమిత్ర సూపర్ వైజర్లకు ఇటీవల పూణెలో శిక్ష ణ ఇచ్చారన్నారు. సాధారణ పశువులకు కృ త్రిమ గర్భాధారణ ద్వారా ముర్రా, జెర్సీ దూ డలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో మెరుగైన జెర్సీ దూడలను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. అలాగే,పాడి బీమా ఇస్తామన్నారు. కార్యక్రమంలో గోపాల మిత్ర సూపర్‌వైజర్ల్లు ఎండి. షాదుల్లా(గజ్వేల్), ఉషయ్య(సిద్దిపేట), సత్యనారాయణ (నర్సాపూర్), శ్రీనివాస్‌రెడ్డి (జహీరాబాద్), అర్జునయ్య(సంగారెడ్డి) పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...